ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వీళ్ల లైఫ్ ఖతం! లాస్ట్ బెంచ్‌లో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూస్తే..

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:32 PM

క్లాస్‌లో టీచర్ పాఠం చెబుతుండగానే వెనక బెంచిలో కూర్చున్న కొందరు విద్యార్థులు మసాలా మరమరాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదువుపై దృష్టిపెట్టకుండా జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారంటూ జనాలు ఆ స్టూడెంట్స్‌ను తిట్టిపోస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: స్టూడెంట్ లైఫ్‌‌లో ఉండే మజానే వేరు. ఏ బాదరబందీ లేని దశ అది! స్నేహితులు, సినిమాలు, పార్టీలు మినహా మరేమీ అవసరం లేదన్న రేంజ్‌లో విద్యార్థులు ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఉండాలి కూడా. కానీ దేనికైనా ఓ హద్దు ఉండాలి. కాలేజీ డేస్‌లో ఫన్‌కు ప్రాధాన్యం ఇస్తూనే చదువులపై కూడా దృష్టిపెట్టాలి. భవిష్యత్తులో ఉద్యోగవ్యాపారాల్లో రాణించేందుకు అవసరమైన మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే జీవితం చేజేతులా నాశనం చేసుకున్న వారవుతారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఓ కాలేజీలో లాస్ట్‌ బెంచ్ విద్యార్థుల తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది (Viral). ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral: రూ.4.2 కోట్ల ఆదాయం! తన సక్సెస్ ఫార్ములా చెప్పిన యువకుడిపై జనాల ఫైర్


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కాలేజీలు కొందరు విద్యార్థులు క్లాస్ జరుగుతున్నా పట్టించుకోకుండా అతి అల్లరికి తెర తీశారు. లెక్చరర్‌కు కనబడకుండా వెనకు కూర్చుని ఏకంగా చాట్ తయారు చేశారు. ఓ విద్యార్థి టమాటాలు, ఉల్లిపాయలు ముక్కలుగా చేసి ఓ హ్యాండ్‌హెల్డ్ మిక్సీలో వేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న మురుమురాల ప్యాకెట్ విప్పి ఓ బాక్సులో పోశాడు. ఆ తరువాత ఉల్లిపాయలు, టమాటాల ముక్కలు అందులో వేసి బాగా కలిపాడు. అనంతరం, వాళ్లందరూ వాటిని తింటూ ఎంజాయ్ చేశారు. ఓ విద్యార్థి ఇదంతా కెమెరాలో రికార్డు చేశాడు.

Viral: వారెవ్వా.. పనిమనిషికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి..!


ఇక ఈ వీడియో నెట్టింట బాట పట్టడంతో జనాలు షాకైపోతున్నారు. తామేదో ఘన కార్యం చేస్తున్నట్టున్న ఆ విద్యార్థుల తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు. చేజేతులా జీవితం నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టీచర్‌ను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు గానీ తమ జీవితంలో తామే నిప్పులు పోసుకుంటున్నామన్న స్పృహ వీరిలో కొరవడిందని కొందరు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. నెట్టింట వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇలా చేసుండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కొందరు వారిపై సెటైర్లు కూడా వేశారు. చదువులు తమకు పనికి రావని ముందే డిసైడ్ అయిన వాళ్లు ముందుజాగ్రత్తగా భవిష్యత్తు కోసం రెడీ అవుతున్నారంటూ చురకలు వేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!

Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!

Read Latest and Viral News

Updated Date - Oct 20 , 2024 | 04:45 PM