Viral Video: ప్రియుడికి ప్రపోజ్ చేసిన ప్రియురాలు.. మీ హృదయాలు కరగడం గ్యారంటీ
ABN, Publish Date - Aug 28 , 2024 | 01:02 PM
సాధారణంగా ప్రియుడే ప్రియురాలికి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఓ చోట ప్రియురాలే ప్రియుడికి తన ప్రేమను తెలియజేసింది. సాదాసీదాగా అయితే చర్చించుకోవడానికి ఏమీ ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రియుడే ప్రియురాలికి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఓ చోట ప్రియురాలే ప్రియుడికి తన ప్రేమను తెలియజేసింది. సాదాసీదాగా అయితే చర్చించుకోవడానికి ఏమీ ఉండదు. కానీ ఆమె ప్రపోజ్ చేసిన తీరును చూసి నెటిజన్లు.. అదృష్టవంతుడంటే ఆ ప్రియుడే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. అమూల్య గోయల్ అతని ప్రియురాలు బన్సాల్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తుంటారు. ఇరువురు ఫ్లైట్ ఎక్కి తమ సీట్లలో కూర్చుంటారు.
అయితే బన్సాల్ ఎన్నో రోజులుగా గోయల్‌ని ప్రేమిస్తోంది. ఎలాగైనా తన ప్రేమను వ్యక్తపరచడానికి వినూత్నంగా ఆలోచించిన బన్సాల్ ప్రపోజల్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. విమానంలోనే అతని ఎదుట మోకాళ్లపై కూర్చుని తన వెంట తీసుకువచ్చిన డైమండ్ రింగ్‌ని ప్రియుడి చేతి వేళ్లకు తొడిగింది. ఆ వెనకే ఉన్న ప్రయాణికులు "Will You Marry Me" అనే ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదంతా చూసిన ప్రియుడు షాక్‌కి గురయ్యాడు. ప్రియురాలి ప్రపోజల్‌ని వెంటనే అంగీకరించి.. పెళ్లి చేసుకుందాం అని మాటిచ్చాడు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులంతా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. సదరు వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. 3 లక్షలకుపైగా లైక్‌లు, 5 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియోకి "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అనే క్యాప్షన్‌ని ఆమె తన పోస్ట్‌కి జోడించింది. " నేను అనుకున్న దానికంటే ఇలా ప్రపోజ్ చేయడం నాకు బాగా అనిపించింది. ముందునుంచీ ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలని అనుకున్నా. యాదృచ్ఛికంగా, ఈ ఆలోచన నా మదిలో వచ్చింది. విమాన సిబ్బంది అనుమతిస్తారో లేదో నాకు కచ్చితంగా తెలియదు. కానీ అదృష్టవశాత్తు అందరూ సహకరించారు" అని బన్సాల్ పేర్కొంది.
స్పందించిన ఇండిగో..
విమానంలో ప్రపోజ్ చేయడంపై ఇండిగో సంస్థ సానుకూలంగా స్పందించింది. "మీ ఇద్దరికి అభినందనలు! మీ ప్రేమానురాగాలు ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి" అని ఇండిగో తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. ఆ జంట చూడముచ్చటగా ఉందని ఓ నెటిజన్ రాయగా.. నాకు కూడా ఇలాగే ప్రపోజ్ చేయాలని ఉందని మరొకరు అన్నారు. ప్రేమ మాధుర్యాన్ని ఇరువురు తెలియజేశారని మరొకరు చెప్పుకొచ్చారు.
For Latest News click here
Updated Date - Aug 28 , 2024 | 01:06 PM