ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వామ్మో.. ఏసీ పేలితే ఇంతటి విధ్వంసమా!

ABN, Publish Date - Jun 15 , 2024 | 07:29 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏసీ పేలడంతో ఓ ఫ్లాట్ మొత్తం దగ్ధమైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొందరు ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అనేక రాష్ట్రాల్లో ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోయారు. అనేక చోట్ల ఏసీ వినియోగం పెరిగిపోయింది. ఇది చివరకు తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

ఉత్తర‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఫ్లాట్‌లో ఏసీ పేలిపోవడంతో ఫ్లాట్ మొత్తం దగ్ధమైపోయింది. గదులన్నీ అగ్నికీలలకు నల్లగా మాడిపోయి కనిపించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోయినా లక్షల రూపాయల నష్టం వాటిల్లిందట. ఇక నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోకు ఏకంగా 1.5 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి ( Video Shows Completely Charred Flat After AC Explosion).

Viral: వీళ్లేం తల్లిదండ్రులురా దేవుడా.. పుట్టిన రోజున పాప జీవితంతో చెలగాటం!


ఈ వీడియో చూసిన వారందరూ షాకైపోతున్నారు. ఏసీ పేలుళ్ల గురించి విన్నాం కానీ మరీ ఇంత విధ్వంసం జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. లోడ్‌లో అసమతౌల్యం, వైరింగ్ నాణ్యత, సామర్థ్యం తక్కువగా ఉండటం, ఎక్కువసేపు ఏసీని వాడటం, ఏసీలు, ప్లగ్‌ల వద్ద సులువుగా మండే వస్తువులు ఉండటం తదితర కారణాలతో ఇంతటి ప్రమాదం జరిగుండొచ్చని కొందరు అన్నారు. ఇందులో మానవతప్పిదం కూడా ఉండి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది చాలా అసాధారణ ప్రమాదమని, దీనిపై దర్యాప్తు జరగాలని కొందరు డిమాండ్ చేశారు.

కాగా, మే నెలలో నాయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ లో ఏసీ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవంతి మొత్తం దట్టమైన పొగ నిడిపోయింది. ఐదు అగ్నిమాపక యంత్రాలను మంటలను అదుపుల చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 07:29 PM

Advertising
Advertising