Viral: ప్రమాదకరమైన మొసలి పక్కన పిల్లల్ని నిలబెట్టి ఫొటో తీసిన పేరెంట్స్!
ABN, Publish Date - Jul 30 , 2024 | 09:47 PM
నోరుతెరుచుకుని ఉన్న మొసలి పక్కన తన బిడ్డను నిలబెట్టి అతడితో పాటు ఫొటో దిగిన ఓ మహిళ ఉదంతం వైరల్‌గా మారింది. ఇది చూసి జీర్ణించుకోలేకపోతున్న జనాలు మహిళను తెగ తిట్టిపోస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు పిల్లలను తమ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారిని కాపాడుకునేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. తమ జీవితం మొత్తం పిల్లల కోసమే ధారపోస్తారు. కానీ నేటి సోషల్ మీడియా ఆకర్షణలు పలు అవాంఛనీయ ధోరణులకు దారి తీస్తున్నాయి. ప్రతి క్షణాన్ని కమెరాలో బంధించాలన్న యావలో విచక్షణ కోల్పోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ మాయలో పడి సరిదిద్దుకోలేని పొరపాట్లు చేస్తున్నారనేందుకు ఉదాహరణగా ఓ వీడియో (Viral) నెట్టింట కలకలం రేపుతోంది. జనాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
Viral: సొరచేప పుట్టుక.. ఈ ‘మేజిక్’ ఎప్పుడైనా చూశారా? ఎంత ముద్దొస్తోందో! వైరల్ వీడియో!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రోడ్డు పక్కనే ఉన్న మొసలిని చూసేందుకు కొందరు ఎగబడ్డారు. వీరిలో పిల్లలున్న జంటలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ మహిళ ముందుగా మొసలికి అత్యంత సమీపంలో నిలబడి ఫొటో దిగే ప్రయత్నం చేసింది. మొసలి పెద్దగా నోరు తెరిచి తనకు ఎవరు దొరుకుతారా? అన్నట్టు ఎదురు చూస్తున్నా కానీ ఆమె పట్టించుకోలేదు. ఇది చాలదన్నట్టు, ఆమె తన కొడుకుతో కూడా ఫొటోదిగేందుకు ప్రయత్నించింది. మొసలిని చూసి భయపడిపోతున్న అతడిని లాక్కొచ్చి మరీ తన ముందు నిలబెట్టుకుని ఫొటో దిగింది. చిన్నారి యేమో మొసలి ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడిపోయాడు. మొసలి చూసి మరికొందరు చిన్నారులు కూడా దానికి దగ్గరా వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దలు బోలెడంత మంది ఉన్నా వారిని ఆపేందుకు ఒక్కరూ ప్రయత్నించలేదు సరికదా తమ దానితాము ఫొటోలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు (Video Shows Parents Making Kids Pose With Alligator ).
ఇక ఈ వీడియో చూసిన జనాలు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. మొసలి ఎంత ప్రమాదకరమో అక్కడున్న వారెవరూ అర్థం చేసుకోలేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. కన్నబిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తామెన్నడూ చూడలేదని కొందరు అన్నారు. సోషల్ మీడియా క్రేజ్ కొందరిని విచక్షణ మరిచేలా చేస్తోందని అన్నారు. ఇక ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వీడియో మాత్రం ఎనిమిది నెలల క్రితం నాటిదని కొందరు చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో సెన్సేషన్‌గా మారింది.
కాగా, భారత్‌లో కూడా ఇటీవల ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట సంచలనం రేకెత్తించింది. ఓ మహిళ ఏకంగా తన పిల్లాడిని ఎత్తుకుని రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే స్టెప్పులేసిన ఆమె ఆ తరువాత పిల్లాడిని ఎత్తుకున్నానన్న విషయం కూడా మర్చిపోయి డ్యాన్స చేసింది. దీంతో, పిల్లాడు చేతుల్లోంచి జారి కిందపడ్డాడు. ఈ వీడియోపై కూడా నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
Updated Date - Jul 30 , 2024 | 09:47 PM