ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: షాకింగ్! కోడి గుడ్డు కనబడగానే ఈ పాము ఎలా రెచ్చిపోయిందో చూడండి..

ABN, Publish Date - Oct 21 , 2024 | 06:22 PM

తన తలకంటే పెద్దగా ఉన్న గుడ్డును ఓ పాము అమాంతంగా తినేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పాము తన నోరును పెద్దదిగా తెరవడం చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో అన్నీ వింతలే. ఈ అశ్చర్యకర విషయాలకు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. జంతు ప్రపంచానికి సంబంధించి నిత్యం ఆసక్తికర విషయాలు, వీడియోలు జనాలను అలరిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ వీడియోలో పాము కోడి గుడ్డును తిన్న తీరు చూసి అంతా షాకైపోతున్నారు (Viral). ఇదెలా సాధ్యమైందని కూడా కొందరు ప్రశ్నించారు.

Viral: పైల్స్‌తో నరకం! లీవ్ కోసం ప్రూఫ్ కావాలని మేనేజర్ ఉద్యోగిని అడగడంతో..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి తన చేతిలో గుడ్డు పెట్టుకుని పాము ముందు ఉంచాడు. దాన్ని చూడగానే పాము తన నోటిని కోడి గుడ్డు అంత సైజుకు తెరిచి అమాంతంగా తినేసింది. అలా గుడ్డు గొంతుకలోకి వెళ్లగానే మెడచుట్టూ ఉన్న కండరాలు దాన్ని మరింత లోపలకు తోశాయి. క్షణాల్లో ఆ గుడ్డు గొంతుకలో నుంచి పొట్టలోపలికి వెళ్లిపోయింది.

వీడియోలో ఇదంతా చూసి జనాలు షాకైపోతున్నారు. ప్రకృతిలో ఎన్ని వింతలు ఉన్నాయో లెక్కేలేదని కొందరు కామెంట్ చేశారు. అంత పెద్ద గుడ్డును పాము ఎలా ఒక్కసారిగా నోట్లో పెట్టుకోగలిగిందని కొందరు ప్రశ్నించారు. పాము శరీర నిర్మాణమే ఇందుకు కారణమని నెటిజన్లు కొందరు చెప్పుకొచ్చారు.

Viral News: పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. కారణం ఏంటో తెలుసా?


జంతుశాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, పాముల దవడలు ఇతర జంతువుల్లాగా ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండవు. దీంతో, అవి తమ నోరును కావాల్సినంత పెద్దగా తెరవగలవు. ఇక గుడ్డు కడుపులోకి వెళ్లాక పెంకులు మినహా మిగతా అంతా జీర్ణమైపోతుందట. చివరగా మిగిలిన పెంకులను పాము విసర్జిస్తుందట. పరిణామ క్రమంలో భాగంగా పాముకు దక్కిన అరుదైన సామర్థ్యం ఇదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాము శరీర నిర్మాణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని శరీరంలో వేల కొద్దీ ఎముకలు ఉంటాయి. వెన్నెముక, పక్కటెముకలు కూడా ఉంటాయి. పాములు తమ నాలుకతో వాసన చూస్తాయట. అందుకే అవి మాటమాటికీ తమ నాలుకను బయటపెడతాయట. అంతేకాకుండా, భూమిలోపలి ప్రకంపనలను అవి తమ కింది దవడ ద్వారా గుర్తిస్తాయట. ఇక పాములు తమ సైజును బట్టి చిన్న చిన్న చిమలు మొదలు భారీ సైజులో ఉండే దుప్పిలు, లేళ్లను కూడా తింటాయి. 70 శాతం పాములు గుడ్లు పెడితే చలి ప్రదేశంలోని పాములు మాత్రం పిల్లలకు జన్మనిస్తాయి. పాముకు పళ్లు ఉండవు కాబట్టి తమ వేట మొత్తాన్ని అమాంతంగా మింగేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక పాములు స్వతహాగా శాంతంగానే ఉంటాయని, తమకు ప్రమాదం ఏర్పడినట్టు భావిస్తేనే కాటు వేస్తాయని చెబుతున్నారు.

Viral: 300 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరుల్ని చేసి.. విచారంలో కంపెనీ యజమాని! ఎందుకంటే..

Read Latest and Viral News

Updated Date - Oct 21 , 2024 | 06:33 PM