Viral: ఈమె భర్త కొంప ముంచేస్తోందిగా! ఇలాగేతై అతడి పరిస్థితి అధోగతే! షాకింగ్ వీడియో!
ABN, Publish Date - Aug 29 , 2024 | 01:46 PM
ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళితే పొదుపు మంత్రం పఠించే మహిళ భర్త బిల్లు చెల్లిస్తానంటే మాత్రం నచ్చిన ఫుడ్ తింటూ డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తోంది. ఈ మేరకు ఆమె పెట్టిన వీడియోపై నెట్టింట విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బులు ఖర్చుపెట్టాలంటే ఎవరైనా కొంచెం వెనకాడతారు. పొదుపు చేసేందుకే మొగ్గు చూపుతారు. కానీ కొందరు మాత్రం సొంత డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవతలి వారితో ఎంతైనా ఖర్చు పెట్టించేస్తుంటారు. అయితే, కట్టుకున్న భార్యే ఇలా చేస్తే ఆ భర్త దివాలా తీయడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, ఓ మహిళ సరిగ్గా ఇలాగే చేస్తూ నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. మహిళను చూసి షాకైపోతున్న నెటిజన్లు ఆమె భర్తపై జాలి కురిపిస్తున్నారు.
Viral: ఇదేం వింతరా బాబూ.. ఈ దేశంలో ఏడాదికి 13 నెలలట!
తాతియానా కొయెల్లో అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ వీడియోను పోస్టు చేసింది. ఆమె ఉండేది న్యూయార్క్‌లో. ఇన్‌స్టాలో ఆమెకు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. జీవనశైలికి సంబంధించి వీడియోలు పోస్టు చేసే ఆమె నెట్టింట మంచి పాప్యులారిటీ సాధించుకుంది. అయితే, ఇటీవల ఆమె వీడియో నెట్టింట కలకలం సృష్టించింది. ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళితే తానెంత ఖర్చుపెట్టేది, భర్తతో వెళితే ఎలా ఎంజాయ్ చేసేది చెబుతూ ఆమె ఈ వీడియో షేర్ చేసింది (Viral Clip Shows Woman's Frugal Spending With Her Money But Extravagant With Husbands).
Viral:17 ఏళ్లకే చదువుకు గుడ్‌బై చెప్పి యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టిన యువతి! ఇప్పుడెలా ఉందో తెలిస్తే..
తను ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళితే చాలా తక్కువ ఖరీదైన ఫుడ్ ఆర్డరిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. బ్రెడ్ వంటి ఫుడ్స్‌ను..అదీ కొద్ది మొత్తంలో మాత్రమే తింటానని వివరించింది. ఇక భర్తతో పాటు రెస్టారెంట్‌కు వెళితే మాత్రం అక్కడున్న అత్యంత ఖరీదైన ఫుడ్‌ను ఆర్డరిస్తానని, కావాల్సినంత తిని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చింది. బిల్లు గురించి అస్సలు పట్టించుకోనని, డైటింగ్‌ను పక్కనపెట్టి ఫుల్లుగా తింటానని చెప్పింది.
ఇక వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఆమె వీడియోకు ఏకంగా 41 లక్షల మందికి పైగా వ్యూస్ వచ్చాయి. 76 వేల లైకులు వచ్చాయి. ఇక రకరకాల వ్యాఖ్యలతో నెటిజన్లు కామెంట్ సెక్షన్లో హోరెత్తించారు. భార్య ఇలా కడుపునిండా తింటుంటే ఆమె సంతోషం చూసి భర్త మైమరిచిపోతాడు. బిల్లు గురించి పట్టించుకోడు’’ అని ఓ వ్యక్తి అన్నాడు. ‘‘భర్త డబ్బు, నీ డబ్బు వేర్వేరు కాదు.. దంపతులిద్దరూ కలిసి ఎంజాయ్ చేయాలి’’ అని మరో వ్యక్తి అన్నారు. ఏ భార్య అయినా ఇలా ఉంటే భర్త త్వరలోనే దివాలా తీస్తాడు. ఆమె అతడి కొంప ముంచేస్తోంది’’ అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇలా వీడియో ప్రస్తుతం నెటిజన్లకు హాట్‌టాపిక్‌గా మారింది.
Updated Date - Aug 29 , 2024 | 01:55 PM