Viral News: రోజులో 1గంట నిద్ర కోల్పోపోతే ఏం జరుగుతుంది? అపోలో డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలివీ..!
ABN, Publish Date - May 23 , 2024 | 03:28 PM
ఇప్పటి బిజీ జీవితాల కారణంగా చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాత్రిళ్లు మొబైల్ ఫోన్లు, సిస్టమ్ లలో కాలం వెళ్లబుచ్చుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది యువత రోజులో 3,4 గంటలకు మించి నిద్రపోవడం లేదు. మరికొందరు వివధ కారణాల వల్ల నిద్రను బలవంతంగా అణుచుకుంటారు. అయితే రోజులో 1 గంట నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందనే విషయం మీద హైదరాబాద్ అపోలో న్యూరాలజిస్ట్ చాలా షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
నిద్ర గొప్ప ఔషధం అని అంటారు. సరైన నిద్ర ఉంటే సగం రోగాలు దూరం ఉన్నట్టే.. అయితే ఇప్పటి బిజీ జీవితాల కారణంగా చాలామంది నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాత్రిళ్లు మొబైల్ ఫోన్లు, సిస్టమ్ లలో కాలం వెళ్లబుచ్చుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది యువత రోజులో 3,4 గంటలకు మించి నిద్రపోవడం లేదు. మరికొందరు వివధ కారణాల వల్ల నిద్రను బలవంతంగా అణుచుకుంటారు. అయితే రోజులో 1 గంట నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందనే విషయం మీద హైదరాబాద్ అపోలో న్యూరాలజిస్ట్ చాలా షాకింగ్ నిజాలు బయటపెట్టారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న సుధీర్ కుమార్ అనే డాక్టర్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'మీరు కేవలం ఒక గంట నిద్ర కోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పట్టవచ్చు' అన్నది అందులో సారాంశం. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నిద్రలేమి కారణంగా తలనొప్పి, పేలవమైన దృష్టి, చిరాకు, నిర్ణయాలు తీసుకునే సామర్ఖ్యం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!
ఈ పోస్ట్ ను Dr Sudhir Kumar MD DM తన ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు. 'పగటి పూట నిద్రపోయి రాత్రి కోల్పోయిన నిద్రను భర్తీ చేయవచ్చా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'నా వయసు 81. నేను ఇప్పటికీ చురుగ్గా ఉన్నాను. నాకు 5 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం లేదు' అని మరొక వృద్ధుడు కామెంట్ చేశాడు. 'నిద్ర నిజంగానే జీవితానికి అమృతం' అని మరొకరు కామెంట్ చేశారు.
భోజనం తరువాత ఓ చిన్న బెల్లం ముక్క తింటే ఏం జరుగుతుందంటే..!
ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 23 , 2024 | 03:28 PM