ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: ‘భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసుంటా’.. భార్య చేసిన పనికి ఊరంతా షాక్..

ABN, Publish Date - Apr 04 , 2024 | 01:43 PM

తన వివాహేతర సంబంధం విషయం బయటకు తెలిస్తే భర్త ఏమంటాడో అనే భయం లేకుండా ఆమె భర్త దగ్గర వింత డిమాండ్ చేసింది. ఏకంగా బాయ్ ఫ్రెండ్ ను ఇంట్లో పెట్టుకోవాలంటూ..

నేటికాలంలో ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలు దర్శనమిస్తున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన భార్యాభర్తల జీవితాలలో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లై ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఆమె. భర్త, పిల్లలతో ఆనందంగా ఉండాల్సినది కాస్తా మరొక మగాడి మాయలో పడింది. తను చేసేది తప్పని ఆమెకు ఏ కోశానా అనిపించలేదు. పైపెచ్చు తన వివాహేతర సంబంధం బయటపడగానే తన బాయ్ ఫ్రెండ్‌ను తమతో పాటూ ఇంట్లో ఉంచుకోవాలంటూ భర్తను డిమాండ్ చేసింది. అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో పెద్ద డ్రామానే నడిపింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఇంట్లో ఉండాల్సిందే!

ఉత్తరప్రదేశ్‌.. గోరఖ్ పూర్‌లోని పిప్రైచ్‌లో 34 ఏళ్ళ మహిళ నివసిస్తోంది. ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు గత 7ఏళ్ల నుంచి పక్క గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని భర్త దగ్గర దాచిపెట్టి అతనితో ప్రేమాయణం నడుపుతోంది. కానీ ఆమె భర్త దగ్గర ఈ విషయం బయటపడనే పడింది. విషయం బయటకు తెలిస్తే భర్త ఏమంటాడో అనే భయం లేకుండా ఆమె భర్త దగ్గర వింత డిమాండ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్‌ను తమతో పాటూ తమ ఇంట్లోనే ఉంచుకోవాలని, అతనికి ఆర్థికంగా సహాయం చెయ్యాలని కూడా భర్తను డిమాండ్ చేసింది. ఈ మాటలు వినగానే భర్తకు కోపం వచ్చి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో మహిళ తన డిమాండ్ సాధించుకోవాలనే ఆలోచనతో కొత్త డ్రామాకు తెరతీసింది.

ఇది కూడా చదవండి: ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?


కరెంట్ స్తంభమెక్కి..!

పిప్రైచ్ గ్రామంలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ పోల్ ఎక్కింది. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంట్లో ఉంచుకోవాలని, అతనికి ఆర్థికంగా సహాయం చెయ్యాలని లేకపోతే తాను కరెంట్ స్తంభం దిగనని తెగేసి చెప్పింది. కరెంట్ స్తంభం మీద ప్రమాదరమైన రీతిలో కరెంట్ వైర్లు ఉండటంతో ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు మహిళ చేష్టకు విస్తుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తదనంతరం మహిళను కరెంట్ స్తంభం నుండి బలవంతంగా కిందకు తీసుకొచ్చారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 04 , 2024 | 03:05 PM

Advertising
Advertising