ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai: వామ్మో.. 1బీహెచ్‌కే ఇంటి రెంటు రూ.45 వేలా! షాక్‌లో జనాలు!

ABN, Publish Date - Oct 04 , 2024 | 11:22 AM

ముంబైలో ఓ 1 బీహెచ్‌కే ఇంటి అద్దె రూ.45 వేలు అన్న ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ రెంటు చూసి జనాలు షాకైపోతున్నారు. ఇదేం దారుణం అంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని మహానగరాల్లో ఇళ్ల అద్దెలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే ఘటన ఒకటి వైరల్‌గా మారింది. ఇలాగైతే సామస్యులు బతకగలరా అంటూ జనాలు గగ్గోలు పెట్టేలా చేస్తోంది. ముంబైలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..


ముంబైలోని మాతుంగా ఈస్ట్ ప్రాంతంలో 1బీహెచ్‌కే ఇంటి అద్దె రూ.45 వేలు అంటూ ఓ పోస్టు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఇంటిని స్థానిక భాషలో ఛాల్ అని పిలుస్తారు. చిన్న చిన్న గదులు ఉండే ఈ ఇళ్లుల్లో మంచి వసతులు ఉండవు. ఓ అంతస్తులోని వారందరికీ కలిపి ఒకే బాత్‌రూం ఉంటుంది. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఇక్కడ అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అలాంటి భనవంలోని ఓ 1బీహెచ్‌కే ఇంటి రెంటు ఏకంగా రూ.45 వేలుగా నిర్ణయించడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. ‘ఈ పాత ఇంటిని రూ.45 వేలకు అద్దెకు ఇస్తారట. దీనికి ఓల్డ్ స్కూల్ స్టైల్ అని ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ పేదరికానికి కూడా ట్విస్ట్ ఇచ్చింది’’ అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్టు చేశారు (Viral Post Sparks Outrage Over Mumbais Soaring Rent).

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!


ఇక వీడియోపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఈ ఇళ్లకంటే ప్రభుత్వ హాస్టల్‌లో వసతులే మెరుగ్గా ఉంటాయని కొందరు వ్యాఖ్యానించారు. చూస్తే ఏవగింపు కలుగుతున్న ఈ ఇంటి రెంటు రూ.45 వేలుగా నిర్ణయించడం సిగ్గు అనిపించట్లేదా అని ఓ వ్యక్తి మండిపడ్డాడు. రూ.45 వేలు కాదు రూ. లక్ష చేస్తే పోలా అని మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

కాగా, బెంగళూరులో కూడా ఇలాంటి పలు ఉదంతాలు నెట్టింట హల్‌చల్ చేశాయి. వర్క్ ఫ్రం మోం ముగియడంతో నగరంలో ఇంటి అద్దెలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా అనేక మంది పేయింగ్ గెస్టు అకామడేషన్ లేదా హాస్టల్‌లో ఉండే బాగుంటుందని అనుకుంటుంటే మరికొందరు మాత్రం సొంత ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంత భారీగా అద్దెలు చెల్లించేబదులు అప్పోసొప్పో చేసి ఇల్లు కొనుక్కుంటే మనకంటూ ఓ గూడు మిగిలింటుందని అనేక మంది భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇతరులతో కలిసి ఇంటి అద్దెను పంచుకుంటే అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌తో వచ్చే ఆంక్షలకంటే ఇదే మెరగని వాదిస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Oct 04 , 2024 | 11:32 AM