ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్లాడ్ని ముందు కూర్చోబెట్టుకుని.. విన్యాసాలు.. అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్లు..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 10:08 AM

బైక్‌పై వేగంగా వెళ్లడం.. స్టంట్స్ చేయడం డేంజర్ అని తెలిసినా.. సరదా కోసం కొంతమంది బైక్‌పై విన్యాసాలు చేస్తుంటారు. బైక్‌పై స్టంట్స్ వేయడం ద్వారా ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

Reckless Driving

బైక్‌పై వేగంగా వెళ్లడం.. స్టంట్స్ చేయడం డేంజర్ అని తెలిసినా.. సరదా కోసం కొంతమంది బైక్‌పై విన్యాసాలు చేస్తుంటారు. బైక్‌పై స్టంట్స్ వేయడం ద్వారా ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇతరులకు ఇబ్బంది కలిగేట్లు వ్యవహరించకూడదు. అన్ని తెలిసినా కొందరు మాత్రం ఏమి పట్టించుకోకుండా బైక్‌పై వేగంగా వెళ్లడం, స్టంట్స్ వేయడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు కొన్ని బయటకు వస్తే.. మరికొన్ని బయటకు రావు. తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై ముందు ఒక చిన్నారి కూర్చెబట్టుకుని బైక్ హ్యాండిల్ వదిలేసి.. వేగంగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..


సీతాపూర్‌లో..

ఈ వీడియోలో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌‌లో జరిగింది. ఒక వ్యక్తి హైవేపై చిన్నారితో బైక్‌పై ఘోరమైన స్టంట్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి బైక్‌ను అతివేగంతో నడపడంతో పాటు.. హ్యాండిల్ వదిలేసి దానిపై నిల్చున్నట్లెు వీడియోలో కనిపిస్తోంది. ఓ వైపు బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై చిన్నారి కూర్చోబెట్టుకున్నాడు. వీడియోలో మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినట్లు కనిపించకపోయినప్పటికీ అలాంటి విన్యాసాల ద్వారా ఎలాంటి లాభం లేకపోగా.. తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తన సరదా కోసం బైక్‌పై కూర్చున్న చిన్నారి గురించి ఆ వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వీడియోలో కనిపిస్తోంది.


రహదారిపై విన్యాసాలు..

రహదారిపై విన్యాసాలు చేసుకుంటూ వెళ్లగా రోడ్డుపై మధ్యలో ఎద్దు అడ్డుగా వచ్చింది. ఆ ఎద్దును తప్పించుకుని వెళ్లిన తర్వాత కూడా ప్రమాదకరమైన స్టంట్‌ను కొనసాగించాడు. అదృష్టావశాత్తు ఎద్దు నుంచి ఆ వ్యక్తి తప్పించుకున్నారు.. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. హైవేపై బైక్‌ను అనుసరిస్తున్న మరో వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఎక్కువై.. రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Viral Video: కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు.. తీరా రాత్రి జరిగిన సీన్ చూసి అంతా షాక్..


నెటిజన్ల రియాక్షన్..

ఈ వీడియో చూసిన నెటిజన్లు బైక్‌పై విన్యాసాలు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని ఒకరు కామెంట్ చేయగా.. ఇలామంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలని మరికొందరు కామెంట్స్ చేశారు. పిల్లాడి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మరికొందరు.. భారీగా జరిమానా వేయడంతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Viral Video: కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Viral News and Latets Telugu News

Updated Date - Jul 18 , 2024 | 10:08 AM

Advertising
Advertising
<