ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త

ABN, Publish Date - Nov 07 , 2024 | 06:32 PM

వాటర్ బాటిల్ కొంటున్నారా? ఇలాంటి షాప్ ఓనర్స్ ఉంటారు. వీళ్లతో జాగ్రత్త. ఈ తరహా స్కామ్స్ నుంచి దూరంగా ఉండాలంటే మొత్తం వార్త చదివేయండి.

పాట్నా: ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు చేసినా మంచి క్వాలిటీ దొరకడం కష్టంగా మారిపోయింది. కల్తీ, స్కామ్స్ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ విషయంలో ఇది మరీ ఎక్కువ. ఫుడ్ ఐటమ్స్ అనే కాదు.. పాల ప్యాకెట్ నుంచి పౌడర్ డబ్బా వరకు ఇదే పరిస్థితి. నాణ్యత అనేది కరువైపోయింది. ఒకవేళ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నా వాటికి అధిక ధర చెల్లించాల్సిందే. కొందరైతే మార్కెట్ ధరకు మించి డిమాండ్ చేస్తుంటారు. ఎంఆర్‌పీని చాలా చోట్ల పట్టించుకోరు షాప్ ఓనర్స్. థియేటర్ల దగ్గర నుంచి బస్టాండ్స్, రైల్వే స్టేషన్ల వరకు ఇది చూడొచ్చు. మరోసారి ఇది ప్రూవ్ అయింది.


ఎందుకివ్వాలి?

బిహార్‌లోని ఒక చోట ఓ దుకాణం యజమాని ఎంఆర్‌పీకి మించి వస్తువులు అమ్మాడు. రూ.18 విలువ చేసే నీళ్ల సీసాను అధిక ధరకు అమ్మాడు. రూ.20 ఇవ్వాల్సిందేనని కస్టమర్‌కు స్పష్టం చేశాడు. కూలింగ్ కోసం అదనంగా మరో రెండు రూపాయలు అవుతుందని దబాయించాడు. అయితే అతడు అందరిలాంటి వినియోగదారుడు కాదు. ఎందుకు ఎక్కువ డబ్బులు చెల్లించాలంటూ గొడవకు దిగాడు. రెండు రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలని ఫైట్ చేశాడు. ఆ షాప్‌తో పాటు ఓనర్స్ ఫొటోలు తీశాడు. దీన్ని గమనించిన ఓనర్ అతడి వద్దకు దూసుకొచ్చాడు. ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ అతడ్ని బెదిరించాడు.


వార్నింగ్

షాప్ ఓనర్ బెదిరింపులకు కస్టమర్ భయపడలేదు. అధిక ధరకు ఎలా అమ్మావంటూ అతడితో గొడవకు దిగాడు. ఇద్దరూ ఒకర్నొకరు బెదిరించుకోవడం వరకు కథ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. కస్టమర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి షాప్ ఓనర్స్‌ను అదుపులోకి తీసుకోవాలని అంటున్నారు. పలు గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో జనాలకు పెద్దగా అవగాహన ఉండదనే ఉద్దేశంతో ఇలాంటి వాళ్లు ఈ తరహా స్కామ్స్‌కు పాల్పడుతుంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని విడిచిపెట్టొద్దని నెటిజన్స్ చెబుతున్నారు.


Also Read:

హైనాల నుంచి మిత్రుడిని కాపాడుకున్న సింహం.. ప్రాణాలు తీసే సమయంలో చెట్టు పైనుంచి..

మిగిలిపోయిన చపాతీ పిండిని ప్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఈ వీడియో చూస్తే.. కళ్లు బైర్లుకమ్మాల్సిందే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఇళ్ల మధ్యనున్న పిల్లిని 10 సెకెన్లలో పట్టుకోండి..

For More Viral And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 07:40 PM