Viral Video: రిషికేశ్‌లో విదేశీయుల గంగాస్నానాలు.. వీడియో వైరల్!
ABN, Publish Date - Apr 29 , 2024 | 09:46 PM
రిషీకేశ్‌లో విదేశీయుల గంగా స్నానం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోపై భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రిషికేశ్‌లో విదేశీయుల గంగా స్నానం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీయులు బికినీలతో గంగాస్నానం చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు విదేశీయులు అర్ధనగ్న దుస్తుల్లో గంగాస్నానం చేశారు. మరోసారి తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ జలకాలు ఆడారు. చివరగా సూర్య నమస్కారం కూడా చేశారు. మనుషుల్లో భగవంతుడున్నాడు, మనషులంతా ఒక్కటే అన్న కాప్షన్ కూడా జత చేశారు.
Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..
అయితే, కొందరు మాత్రం ఈ వీడియోపై విమర్శలు గుప్పించారు. ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యమున్న స్థలంలో ఇలా చేయకూడదని చెప్పారు. పాశ్చత్యపోకడల ప్రభావం భారతీయ సంస్కృతిపై పెరిగిపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు (Viral video sparks debate on cultural sensitivity among tourists in Rishikesh).
మరికొందరు మాత్రం విదేశీయులకు మద్దతుగా నిలిచారు. నదీస్నానంతో వారందరూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారని చెప్పారు. చివర్లో వారు దోసిలితో నీళ్లు తీసుకుని వదిలిపెట్టడాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. వారందరిలో ఆధ్యాత్మిక భావన తప్ప మరొకటి లేదని, వారి చర్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కామెంట్ చేశారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - Apr 29 , 2024 | 09:59 PM