Viral Video: ఏంటీ.. కాఫీ తయారుచేసిన వీడియోకు ఏకంగా 56మిలియన్ల వ్యూసా.. ఇంతకీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే..!
ABN, Publish Date - Apr 05 , 2024 | 12:56 PM
కేవలం కాఫీ తయారుచేసిన వీడియో.. నెటిజన్లకు అంతగా ఎందుకు నచ్చిందంటే..
సోషల్ మీడియాలో బోలెడు రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తుంటాయి. తమ జీవిత అనుభవానికి దగ్గరగా ఉండే ఏ విషయాన్ని అయినా నెటిజన్లు చాలా ఇష్టంగా చూస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. ఓ అమ్మాయి కాఫీ తయారు చేసిన ఈ వీడియో ఏకంగా 56 మిలియన్ల వ్యూస్ సంపాదించడం చాలా షాకింగ్ గానూ ఉంది. అసలింతకీ ఈ వీడియోలో నెటిజన్లకు అంతగా ఏం నచ్చిందనే విషయం తెలుసుకుంటే..
పనులు చేసేటప్పుడు పని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అనే మాట వినే ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఓ అమ్మాయి కాఫీ తయారుచేస్తున్న వీడియో ఇది. వీడియోలో ఓ అమ్మాయి కాఫీ కలుపుకుని స్పూన్ ను సింక్ లో పెడుతుంది. కాఫీ తాగుదాం అని చూస్తే కప్పు కనిపించదు. ఏం జరిగిందో అర్థం కాని అయోమయంలో మళ్లీ కాఫీ కలుపుకుందామని ఇంకో ఖాళీ కప్పు తీసుకుంటుంది. అందులో కాఫీ పొడి వేస్తుంది. ఆ తరువాత క్రీమ్ కోసం ఫ్రిజ్ లో నుండి క్రీమ్ ప్యాకెట్ తీసుకొస్తుంది. అయితే ప్యాకెట్ తెచ్చేలోపు అక్కడ కప్పు ఉండదు. ఏదో గుర్తు తెచ్చుకుని మళ్లీ ప్రిజ్ దగ్గరకు వెళ్లి క్రీమ్ ప్యాకెట్ తీసుకుని దాని స్థానంలో ఉంచిన కాపీ కప్పు తీసుకుని వస్తుంది. కప్పులో కాఫీ పొడి, క్రీమ్, వేడినీరు వేసి మళ్లీ కాఫీ తయారుచేస్తుంది. కాఫీ కప్పు తీసుకుని వెనక్కు తిరగగానే మరొక వైపు మూడు కప్పుల కాఫీ కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: దంతాల మీద ఎర్రగా గార పేరుకుపోయిందా? ఈ టిప్స్ తో వదిలించుకోవచ్చు..!
చేసే పని మీద ఏకాగ్రత లేకపోతే(Absent mind) ఏం జరుగుతుందో ఈ వీడియోలో కామెడీగా చూపించారు. చూడ్డానికి ఇది కామెడీగా అనిపించినా, ఎంతో మందికి తమ వాస్తవికతను ఈ వీడియో గుర్తు చేస్తోంది. ఈ వీడియోను swatirajputofficial అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో తమకు చాలా దగ్గరగా ఉందంటూ చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 56మిలియన్ల వీక్షణలు సంపాదించడం, నెటిజన్లు తమకు దగ్గరగా ఉందని చెప్పడం చూస్తే ప్రజలు చేస్తున్న పని పట్ల ఎంత అబ్సెంట్ మైండ్ తో ఉంటున్నారో అర్థం అవుతోంది. ఇక ఈ వీడియో గురించి నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 05 , 2024 | 12:56 PM