ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Salwar Kameez: డ్రెస్ చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం

ABN, Publish Date - Jun 22 , 2024 | 07:34 AM

హోటల్, రెస్టారెంట్లలో వెయిటర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే విధిగా ఆ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. స్విట్జర్లాండ్‌లో కొన్ని రెస్టారెంట్లు ఇందుకు అతీతం. అక్కడ కొన్ని చోట్ల వెయిటర్ల డ్రెస్సులకు సంబంధించి నిబంధనలు ఏమి లేవు. ఓ రెస్టారెంట్‌లో మహిళ వెయిటర్ ఏకంగా సల్వార్ కమిజ్ ధరించి ఆశ్చర్య పరిచింది.

Waitresses Wear Indian Dress

హోటల్, రెస్టారెంట్లలో వెయిటర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే విధిగా ఆ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. స్విట్జర్లాండ్‌లో కొన్ని రెస్టారెంట్లు ఇందుకు అతీతం. అక్కడ కొన్ని చోట్ల వెయిటర్ల డ్రెస్సులకు సంబంధించి నిబంధనలు ఏమి లేవు. ఓ రెస్టారెంట్‌లో మహిళ వెయిటర్ ఏకంగా సల్వార్ కమిజ్ ధరించి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను ఒకరు తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.


ఉట్టిపడిన భారతీయత

వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో ‘సోల్‌మేట్స్ ఎక్స్ ప్రెస్‌ పేరుతో షేర్ చేశారు. ఆ వీడియోను జర్మనీలో ఉంటోన్న భారతీయ దంపతులకు డెడికేట్ చేశారు. ‘స్విట్జర్లాండ్‌లో భారతీయత ఉట్టిపడింది. భారతదేశంలో కంటే ఇక్కడ సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనిపించింది. యూరప్ ఖండంలో కొన్ని రెస్టారెంట్లలో భారతీయత ఉట్టిపడటం సంతోషం కలిగించింది. ఇతరదేశాల్లో కూడా సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగుతుండటం ఆనందంగా ఉంది అని’ రాసుకొచ్చారు. ఇండియాలో కన్నా స్విట్జర్లాండ్‌‌లోనే భారతీయత ఉట్టిపడిందని అభిప్రాయ పడ్డారు.


నిండుగా యువతి

రెస్టారెంట్ వద్ద యువతి సల్వార్ కమిజ్ ధరించి నిండుగా కనిపించారు. కస్టమర్ల వద్దకు వచ్చి నవ్వుతూ పలకరించారు. ఆ వీడియోలో మరో వెయిటర్ సల్వార్ సూట్ వేసుకొని ఉన్నారు. ఆ వీడియో చూస్తే ఇది స్విట్జర్లాండా..? లేదంటే భారతదేశమా..? అనే సందేహం కలిగింది. రెస్టారెంట్ గోడలపై హిందు దేవతల చిత్రాలు కూడా నెలకొల్పారు.


రెండుసార్లు వెళ్లాం

వారం రోజుల క్రితం వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు 11, 900 వ్యూస్ వచ్చాయి. 4 వేల లైకులు రాగా, వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ఓ యూజర్.. హా హా హా అని నవ్వుతూ.. దేశంలో కంటే ఎక్కువ సంస్కృతి, సంప్రాదాయాలు కనిపించాయని రాసుకొచ్చారు. ఆ రెస్టారెంట్‌కు ఇప్పటికే రెండుసార్లు వెళ్లామని, వెయిటర్లు చక్కగా సర్వ్ చేశారని మరో యూజర్ అభిప్రాయ పడ్డారు.

Updated Date - Jun 22 , 2024 | 07:34 AM

Advertising
Advertising