ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: రోబోతో ఏకధాటిగా 20 గంటల పాటు పనిచేయిస్తే.. షాకింగ్ వీడియో..

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:54 PM

సామర్థ్య ప్రదర్శనలో భాగంగా ఏకంగా 20 గంటల పాటు పనిచేసిన ఓ రోబో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Robot collapses after working for 20 hours

ఇంటర్నెట్ డెస్క్: సామర్థ్య ప్రదర్శనలో భాగంగా ఏకంగా 20 గంటల పాటు పనిచేసిన ఓ రోబో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఘటన జరిగి చాలా కాలమే అయినా ఏఐపై చర్చ అధికమైన నేటి తరుణంలో పాత వీడియోను నెటిజన్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి తెచ్చారు.

మనిషిని పోలినట్టుగా ఉండే ఈ రోబోను భారీ గోదాముల్లో వినియోగించేందుకు అనువుగా ఎజిలిటీ రోబోటిక్స్ అనే సంస్థ రూపొందించింది. ఈ క్రమంలో దాని సామర్థ్యాలను ప్రజలకు చూపించేందుకు ఓ గోదాములో దాన్ని పనిలోకి దింపింది. ఈ క్రమంలో రోబో ఏకంగా 20 గంటల పాటు నిర్విరామంగా పనిచేసింది. సామాన్లను తీసుకొచ్చి జాగ్రత్తగా కన్వేయర్ బెల్ట్‌పై పెట్టింది. అయితే, చివర్లో ఓ బాక్స్ ఎత్తే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన రోబో మళ్లీ లేవలేదు. ఇందుకు సంబంధించిన వీడియో జనాలను ఆశ్చర్యపోయేలా చేసింది (Robot collapses after working 20 hours straight).

Viral: ఈ జూలో ప్రతి శనివారం పులులకు ఉపవాసం.. ఎందుకో తెలిస్తే..


ఘటనపై స్పందించిన ఎజిలిటీ రోబోటిక్స్ ఈ ప్రదర్శనలో రోబో 99 శాతం లక్ష్యాలను చేరుకుందని తెలిపింది. రోబో అకస్మాత్తుగా కూలిపోలేదని కూడా వివరణ ఇచ్చింది. బ్యాటరీ అయిపోవడంతో నియంత్రిత విధానంలో జాగ్రత్తగా తనని తాను స్విచ్ఛాఫ్ చేసుకుందని పేర్కొంది. ఇది రోబోలో తలెత్తిన సమస్య కాదని పేర్కొంది. ఆ తరువాత రోబో సామర్థ్యాలను మరింత విపులీకరించే మరో వీడియోను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. జనాలను ఈ వీడియో కూడా బాగా ఆకర్షించింది.

రోబోల అభివృద్ధిలో ఎదురయ్యే సమస్యలను ఈ వీడియోలు బాగా చూపించాయని అనేక మంది వ్యాఖ్యానించారు. రోబోలు తమకు అప్పగించిన పనులు సుదీర్ఘకాలం పాటు తడబాటు లేకుండా చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంతటి సామర్థ్యమున్న రోబోలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అనేక రంగాల్లో మనుషుల అవసరం ఉండదని అన్నారు.

Viral: మెట్రో రైళ్లల్లోనూ ఈ మరకలా.. నెటిజన్లలో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. జరిగిందేంటంటే..

Updated Date - Apr 12 , 2024 | 08:59 PM

Advertising
Advertising