Viral Video: వామ్మో.. రస్క్ తింటే రిస్కే.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రస్క్‌లను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..!
ABN , Publish Date - Apr 30 , 2024 | 02:09 PM
తియ్యగా ఉండే రస్క్‌లను తినేందుకు పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. టీ, కాఫీలతో పాటు వీటిని తీసుకునేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. అయితే రస్క్‌లను ఎలా తయారు చేస్తున్నారో మీరెప్పుడైనా చూశారా? రస్క్‌లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తియ్యగా ఉండే రస్క్‌లను (Rusks) తినేందుకు పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. టీ, కాఫీలతో పాటు వీటిని తీసుకునేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. అయితే రస్క్‌లను ఎలా తయారు చేస్తున్నారో మీరెప్పుడైనా చూశారా? రస్క్‌లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Rusk making video). ఆ వీడియో చూస్తే ఇకపై రస్క్‌లను తినడానికే భయపడతారేమో. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు (Viral Video).
dieticianricha2095 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు కార్మికులు పెద్ద మొత్తంలో రస్క్‌లను బేకింగ్ చేస్తున్నారు. పూర్తిగా మైదా పిండి, చక్కెర, పామాయిల్‌తో వాటిని తయారు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ముందుగా ఓ మిక్సింగ్ మెషిన్‌లో పామాయిల్ వేశారు. అనంతరం సంచుల కొద్దీ పంచదార, మైదా పిండి వేసి బాగా కలిపారు. తర్వాత ఆ పిండిని పెద్ద సైజు ముద్దలుగా పొడవుగా చేశారు. దాన్ని బ్రెడ్ ట్రేలో సర్దుబాటు చేసి కాల్చారు.. అప్పుడు బ్రెడ్ తయారైంది. ఆ బ్రెడ్‌ను ముక్కలుగా కత్తిరించారు.
ఆ ముక్కలను మళ్లీ ట్రేలో సర్ది మళ్లీ కాల్చారు. అప్పుడు రస్క్‌లు తయారయ్యాయి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``రస్క్‌లను తినడం ఆరోగ్యానికి హానికరం``, ``కొన్ని చోట్ల మిగిలిపోయిన రొట్టెలతో కూడా రస్క్‌లు తయారు చేస్తారు``, ``రస్క్‌ల తయారీలో ఈస్ట్‌ను కూడా ఎక్కువ ఉపయోగిస్తారు. అది ఆరోగ్యానికి హానికరం``, ``ఇలాంటి వీడియోలు చూస్తే ఇకపై నీళ్లు మాత్రమే తాగాలేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి.. ఈ ఫొటోలో హెడ్ ఫోన్స్ ఎక్కడున్నాయో కనిపెట్టండి!
Viral: ఓటరుకు, ప్రజాస్వామ్యానికి పెళ్లి.. వైరల్ అవుతున్న వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..