Share News

Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:14 PM

ఈ ప్రపంచంలోని చాలా మంది పాము అంటేనే ఎక్కువగా భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపాము కంటబడితే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాము అంటే మనుషులకే కాదు.. క్రూరమృగాలకు కూడా భయమే.

Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!
Conversation between tiger and cobra

ఈ ప్రపంచంలోని చాలా మంది పాము (Snake) అంటేనే ఎక్కువగా భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపాము (King Cobra) కంటబడితే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాము అంటే మనుషులకే కాదు.. క్రూరమృగాలకు కూడా భయమే. ఓ నాగుపాము పెద్దపులినే (Tiger) భయపెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. రాజస్తాన్‌లోని రణ్‌తంభోర్ (Ranthambhore) జాతీయ పార్క్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు (Viral Video).


ranthambhorewildlife అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ నాగుపాము ఓ నీటి కాలువ గుండా వెళుతోంది. అదే సమయంలో ఓ పెద్దపులి అక్కడకు వచ్చింది. పాము వెళ్లే వరకు పెద్ద పులి ఒడ్డు మీద ఆగి ఉంది. పెద్దపులిని చూసిన నాగుపాము పడగ విప్పి బుసకొట్టింది. భయపడిన పెద్దపులి రెండు అడుగులు వెనక్కి వేసి నిల్చుండిపోయింది. ఆ ఘటనను సఫారీ టూర్‌కు వెళ్లిన వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ వైరల్‌ వీడియోకు లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``వామ్మో.. పెద్దపులికి కూడా నాగుపాము అంటే భయమే``, ``నాగుపాము విషం అత్యంత ప్రమాదకరం``, ``భారీ శరీరం కలిగిన ఏనుగులను కూడా నాగుపాము క్షణాల్లో చంపగలదు``, ``ఆ రెండింటి మధ్య ఫైట్ జరిగితే రెండూ చనిపోతాయి``, ``పులి చాలా తెలివైనది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న కుక్క ఎమోజీని కనిపెట్టండి..!


Viral Video: పెళ్లి పీటలెక్కబోయే ముందు కూడా స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్.. అసలు కారణమేంటంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2024 | 05:14 PM