Viral Video: వేగంగా వెళ్తున్న బైక్‌పై విన్యాసాలు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
ABN, Publish Date - Sep 29 , 2024 | 11:35 AM
సోషల్ మీడియా జనాలను ఆకట్టుకునేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేస్తుంటారు. వేగంగా వెళ్తున్న బైక్ మీద రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుర్రాడు అలాగే కదులుతున్న బైక్‌పై పుషప్ప్ చేశాడు.
సోషల్ మీడియా జనాలను ఆకట్టుకునేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు (Dangerous Stunts) చేస్తుంటారు. వేగంగా వెళ్తున్న బైక్ మీద రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుర్రాడు అలాగే కదులుతున్న బైక్ (Bike)పై పుషప్స్ (pushups) చేశాడు. తన విన్యాసాలను రికార్డు చేయించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారి చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ కుర్రాడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది (Viral Video).
@ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. బీహార్ (Bihar)కు చెందిన ఓ కుర్రాడు వేగంగా వెళ్తున్న బైక్‌పై పుషప్స్ చేశాడు. ఫుల్ స్పీడ్‌లో బైక్ నడుపుతూ పెట్రోలు ట్యాంక్‌పై చేయి వేసి కాళ్లను పూర్తిగా వెనక్కి తీసుకుని విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత కదులుతున్న బైక్‌పై పుషప్‌లు చేశాడు. ఈ కుర్రాడు గతంలో కూడా బిజీ రోడ్లపై విన్యాసాలు చేసి వీడియోలు రూపొందించాడు. ఈ తాజా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారి పోలీస్ అధికారుల దృష్టిలో పడింది. దీంతో వారు స్థానిక సమస్తిపూర్ పోలీసులను ట్యాగ్ చేసి ఆ కుర్రాడిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఆ వీడియోలో బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు స్పందించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ కుర్రాడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 43 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ కుర్రాడు వాహనదారుల ప్రాణాలకు ప్రమాదకరం``, ``ఇది చాలా ప్రమాదకర విన్యాసం``, ``ఇలాంటి వాళ్లు ఇతర ప్రాణాలను పట్టించుకోరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: 17 ఏళ్ల క్రితం బార్ బిల్లు వైరల్.. 2007లో ఢిల్లీ బార్‌లో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చైందంటే..
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 29 , 2024 | 11:35 AM