Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే బ్రదరూ.. వీడియో చూస్తే ఇలా కూడా అవుట్ అవుతారా అని షాక్ అవ్వక తప్పదు..
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:23 PM
జీవితంలోనే కాదు.. ఆటలో కూడా ఎన్నో విచిత్రకర పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం తప్ప ఎవరూ చేసేదేం ఉండదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ క్రికెట్ వీడియోను చూస్తే విధిని నమ్మాల్సి వస్తుందేమో.
విధిని (Destiny) ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏది జరగాలని ఉంటే అలా జరుగుతుంది అంటుంటారు. జీవితంలోనే కాదు.. ఆట (Game)లో కూడా అలాంటి ఎన్నో విచిత్రకర పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం తప్ప ఎవరూ చేసేదేం ఉండదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ క్రికెట్ వీడియోను (Cricket Video) చూస్తే విధిని నమ్మాల్సి వస్తుందేమో. బ్యాటర్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను బౌలర్ వదిలేశాడు, కానీ, అనూహ్యంగా ఆ బ్యాటర్ ఔటై మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@mukesh1275 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు.. బ్యాటర్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి పిచ్‌పైనే గాల్లోకి లేచింది. ఆ బంతిని అందుకోవడానికి బౌలర్ ప్రయత్నించాడు. అయితే బౌలర్ ఆ క్యాచ్ పట్టలేకపోయాడు. హమ్మయ్యా.. బతికిపోయానని బ్యాటర్ నెమ్మదిగా పరుగు తీస్తున్నాడు. అయితే అనుహ్యంగా ఆ బంతి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టింది. అప్పటికి బ్యాటర్ ఇంకా క్రీజులోకి రాకపోవడంతో అవుట్ అయ్యాడు.
బౌలర్ క్యాచ్ వదిలేసినప్పటికీ ఆ బంతి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టడం చాలా మందికి విచిత్రంగా అనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``విధి చాలా బలీయమైనది``, ``అతడు అవుట్ కావాలని రాసిపెట్టి ఉంది``, ``బ్యాడ్ లక్ అంటే ఇదే బ్రదరూ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..
Viral Video: వార్నీ.. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Optical Illusion Test: మీ కళ్లకు సిసలైన పరీక్ష.. ఈ వ్యక్తుల మధ్యనున్న 3 అరటి పళ్లను కనుక్కోండి..
Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 21 , 2024 | 04:23 PM