Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!
ABN, Publish Date - Dec 22 , 2024 | 03:54 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ట్రక్ ఆగి ఉంది. వెనుక ఇద్దరు వ్యక్తులు దానిని రిపేర్ చేస్తున్నారు. పక్కనే ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆ ట్రక్ కదలడం మొదలైంది. రోడ్డు వైపు వెళ్తోంది.
వాహనాన్ని పార్క్ (Parking) చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ (Hand Brake) తప్పనిసరిగా వేయాలి. లేకపోతే వాహనాలు వాటంతట అవే ముందుకు వెళ్లిపోయి భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. వెంటనే ఎవరైనా స్పందించకపోతే భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఓ అమ్మాయి ధైర్యంగా ముందుకు రావడంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ట్రక్ (Truck) ఆగి ఉంది. వెనుక ఇద్దరు వ్యక్తులు దానిని రిపేర్ చేస్తున్నారు. పక్కనే ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆ ట్రక్ కదలడం మొదలైంది. రోడ్డు వైపు వెళ్తోంది. వెంటనే స్పందించిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రక్ ఎక్కి హ్యాండ్ బ్రేక్ వేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఆ అమ్మాయి తన తెలివి, ధైర్య సాహసాలతో పెను ప్రమాదాన్ని నివారించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 8 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోలోని యువతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఇది దైర్యవంతుల లక్షణం``, ``కొందరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉంటారు``, ``ఆ అమ్మాయి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..
Viral Video: వార్నీ.. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 22 , 2024 | 03:54 PM