Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది.. ఫుట్‌బాల్‌కు నిప్పు అంటించి గేమ్.. ఏం జరిగిందో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:04 PM
కొందరు కుర్రాళ్లు భయంకర సాహసాలు చేస్తుంటారు. ఆ క్రమంలో ఇబ్బందుల్లో పడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని కుర్రాళ్లు అలాంటి పనులే చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్ ఆడడం బోర్‌గా ఫీలై.. బాల్ మీద పెట్రోల్ పోసి దానికి నిప్పంటించారు.
కొందరు కుర్రాళ్లు వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. రెగ్యులర్‌గా ఉండడానికి ఇష్టపడని వాళ్లు ప్రమాదాలతో ఆటలాడుతుంటారు. భయంకర సాహసాలు (Dangerous Stunts) చేస్తుంటారు. ఆ క్రమంలో ఇబ్బందుల్లో పడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని కుర్రాళ్లు అలాంటి పనులే చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్ (Football) ఆడడం బోర్‌గా ఫీలై.. బాల్ మీద పెట్రోల్ పోసి దానికి నిప్పంటించారు (Fire). ఆ ప్రయోగం ఓ కుర్రాడికి భయంకర అనుభవం మిగిల్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@safalbanoge అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు కుర్రాళ్లు రాత్రి సమయంలో గ్రామంలోని రోడ్డుపై ఫుట్‌బాల్ ఆడేందుకు సిద్ధపడుతున్నారు. అయితే సాధారణ ఫుట్‌బాల్ కాకుండా దానికి నిప్పు అంటించాలనుకున్నారు. ఫుట్‌బాల్‌పై పెట్రోల్ వేసి నిప్పంటించారు. మండుతున్న ఆ బంతిని ఓ కుర్రాడు కాలితో తన్నాడు. మరో కుర్రాడు ఆ బంతిని తలతో ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కుర్రాడి జుట్టుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అందరూ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి నీటితో మంటలు ఆపే ప్రయత్నం చేశారు.
ఆ గేమ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోకు వేలల్లో వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అలాంటి కుర్రాళ్లకు మంచి గుణపాఠం అవసరం``, ``అలాంటి ప్రమాదాలు ఒక్కోసారి ఎవరి కంట్రోల్‌లో ఉండవు``, ``ప్రమాదాలతో ఆటలాడితే ఇలాంటివే జరుగుతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..
Optical Illusion Test: మీ కళ్ల వపర్‌కు టెస్ట్.. గులాబీల మధ్యనున్న పీతను 10 సెకెన్లలో గుర్తించండి..
Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి