ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఎలక్ట్రిక్ వైర్లపై బట్టలు ఆరేస్తున్నాడు.. కిందనున్న వ్యక్తి అడిగితే ఏం చెప్పాడంటే..

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:35 PM

ఎన్నో విచిత్రమైన వీడియోలు, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలు ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి మేడ ఎక్కి ఎలక్ట్రిక్ వైర్లపై బట్టలను ఆరేస్తున్నాడు. కిందనున్న ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అతడి సమాధానం వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Man dried clothes on high voltage electric wires

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అది అందరినీ చేరిపోతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇప్పటికే అలాంటి ఎన్నో విచిత్రమైన వీడియోలు, ఫన్నీ వీడియోలు (Funny Videos) చాలా మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలు ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి మేడ ఎక్కి ఎలక్ట్రిక్ వైర్లపై (high voltage electric wires) బట్టలను (Clothes) ఆరేస్తున్నాడు. కిందనున్న ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అతడి సమాధానం వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


rajnishmatela అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఇళ్లకు కరెంట్‌ను సరఫరా చేసే హై టెన్షన్ విద్యుత్ వైర్లపై ఉతికిన బట్టలను ఆరేస్తున్నాడు. కేవలం వైర్లను తాకితే చాలు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న చోట ఆ వ్యక్తి ఏకంగా కరెంటు తీగలపై బట్టలు ఆరేస్తున్నాడు. ఆ వ్యక్తి విద్యుత్ తీగలపై బట్టలు ఆరేస్తున్నప్పుడు, క్రింద నిలబడి ఉన్న వ్యక్తి అతడిని వీడియో తీశాడు. అలా చేయవద్దని సూచించాడు. అందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ.. ``కరెంట్ లేదు కదా.. ఫర్వాలేదు`` అని చెప్పాడు. ``కరెంట్ వస్తే ఏం చేస్తావు`` అని అడిగితే అతడు సమాధానం చెప్పలేదు.


చాలా సేపు నచ్చ చెప్పి అతడి చేత విద్యుత్ వైర్లపై నుంచి బట్టలను తీసేయించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆ అంకుల్ బ్రెయిన్‌కు సెల్యూట్``, ``కరెంట్ వచ్చే లోపు ఆరిపోతాయని అతను అనుకుంటున్నాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ దృష్టికి సరైన పరీక్ష.. వీటిల్లో భిన్నంగా ఉన్న క్యాండీని 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..


Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..


Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 04:35 PM