ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కళ్ల ముందే నదిలో ఎలా కొట్టుకుపోయాడో చూడండి..!

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:43 PM

మహారాష్ట్రలోని రత్నగిరిలో దారుణం జరిగింది. నదిలోకి ఈత కొట్టేందుకు దిగిన వ్యక్తి కళ్ల ముందే కొట్టుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రత్నగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

man was swept away by a river

మహారాష్ట్రలోని రత్నగిరిలో దారుణం జరిగింది (Maharashtra rains). నదిలోకి ఈత కొట్టేందుకు దిగిన వ్యక్తి కళ్ల ముందే కొట్టుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రత్నగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా జిల్లాలోని నదులు ఉప్పొంగుతున్నాయి (Floods). కొంకణ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలలో వరదలు ముంపునకు గురయ్యాయి (Viral Video).


ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు నదిలో ఈత కొట్టేందుకు దిగారు. డ్యామ‌కు ఎగువన ఉన్న నీటిలోకి దిగారు. అయితే నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో వారిలో జయేష్ రామచంద్ర (32) అనే యువకుడు కొట్టుకుపోయాడు. తనను తాను నియంత్రించుకోలేక సుడి గుండంలో చిక్కుకుపోయాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి నుంచి బయటపడడడానికి శాయశక్తులా ప్రయత్నించినా బయటపడడం అతడి వల్ల కాలేదు. దీంతో నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోయాడు.


ఇప్పటివరకు అతడి ఆచూకీ లభ్యం కాలేదు. అతడి కోసం రెస్క్యూ టీమ్‌లు గాలింపు చేపట్టాయి. నీటి ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉండడంతో సెర్చింగ్ ఆపరేషన్ ఫలప్రదం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా రత్నగిరికి గణనీయమైన నష్టం జరిగింది. నీటి ప్రవాహానికి చాలా రహదారులు కొట్టుకుపోయాయి.

ఇవి కూడా చదవండి..

Viral Video: వరదొచ్చినా విందు ఆరగించాల్సిందే.. భార్యలను ఎత్తుకొని మరీ ఎలా వెళ్తున్నారో చూడండి..


Optical Illusion: ఈ చెరువులో దాక్కున్న తాబేలును కనిపెట్టండి.. మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 15 , 2024 | 12:43 PM

Advertising
Advertising
<