ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కూతురికి సవాల్.. కుక్కర్ మూత పెట్టడం కూడా రాని అమ్మాయి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Dec 21 , 2024 | 06:57 PM

కొన్నేళ్ల క్రితం వరకూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా ఇంటి బాధ్యతలు నేర్పేవారు. మగ పిల్లలకు బయటకు వెళ్లి పనులు చేయడం, ఆడ పిల్లలకు వంట పని చేయడం అలవాటు చేసేవారు. ఒక వయసు వచ్చాక ఆడ పిల్లలు తప్పకుండా ఇంటి పనులు, వంట పనుల్లో తల్లికి సహాయం చేసేవారు.

Viral Video

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది పిల్లలకు బయట ప్రపంచం గురించి తెలియడం లేదు. ఇంటి బాధ్యతలు తెలియవు. కొన్నేళ్ల క్రితం వరకూ తల్లిదండ్రులు తమ పిల్లలకు (Children) తప్పని సరిగా ఇంటి బాధ్యతలు నేర్పేవారు. మగ పిల్లలకు బయటకు వెళ్లి పనులు చేయడం, ఆడ పిల్లలకు వంట పని చేయడం అలవాటు చేసేవారు. ఒక వయసు వచ్చాక ఆడ పిల్లలు తప్పకుండా ఇంటి పనులు, వంట పనుల్లో తల్లికి సహాయం చేసేవారు. అయితే ప్రస్తుతం కాలం మారిపోయింది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా పూర్తిగా మారిపోయారు. పిల్లలను పూర్తిగా చదువుకే పరిచయం చేశారు (Viral Video).


తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వల్ల పిల్లలకు చదువు తప్ప వేరే ఏ విషయాల్లోనూ కనీస పరిజ్ఞానం కూడా ఉండడం లేదు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో. ఆ వీడియోలో ఒక అమ్మాయి కుక్కర్ (Cooker) మూత కూడా పెట్టలేకపోయింది. అపర్ణ సింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోను పంచుకుంది. కుక్కర్ మూత పెట్టాలని అపర్ణ తన కూతురికి సవాల్ విసిరింది. ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలనే విషయంపై ఆ అమ్మాయికి కనీస అవగాహన లేదు. ఎంత ప్రయత్నించినా కుక్కర్ మూత పెట్టలేకపోయింది. తల్లి ఆ కుక్కర్ మూతని క్షణాల్లో పెట్టి. భవిష్యత్ లో ఎలా వండుకుని తింటావు అని అంటే.. ఆ అమ్మాయి ``చెఫ్ ని పెట్టుకుంటా`` అని చెప్పింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. 63 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కుక్కర్ కూడా కొత్త తరం వారి కోసం అప్‌గ్రేడ్ కావాలి``, ``జెనరేషన్ జెడ్ వారి జ్ఞానం అది``, ``వంట ఎందుకు? స్విగ్గీ, జొమాటో ఉండగా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే బ్రదరూ.. వీడియో చూస్తే ఇలా కూడా అవుట్ అవుతారా అని షాక్ అవ్వక తప్పదు..


Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..


Viral Video: వార్నీ.. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


Optical Illusion Test: మీ కళ్లకు సిసలైన పరీక్ష.. ఈ వ్యక్తుల మధ్యనున్న 3 అరటి పళ్లను కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 06:57 PM