Viral Video: వార్నీ.. రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:31 PM
చాలా మంది సోషల్ మీడియా ధ్యాసలోనే బతుకుతున్నారు. ఏదైనా వెరైటీగా చేసి వైరల్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియా ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. ప్రపంచం నలమూలల్లో ఎవ్వరు ఏం చేసినా అది అందరికీ క్షణాల్లో చేరిపోతోంది. పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియా ధ్యాసలోనే బతుకుతున్నారు. ఏదైనా వెరైటీగా చేసి వైరల్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు షాకవుతున్నారు (Viral Video).
jeejaji అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు పొడవుగా ఉన్న ఓ ఎండిపోయిన చెట్టు ఎక్కారు. చెట్టు కొమ్మ మధ్యలో కర్ర పెట్టి అటూ ఇటూ కూర్చున్నారు. అంత ఎత్తులో, ప్రమాదకర పరిస్థితుల్లో ఇద్దరూ ఊగడం ప్రారంభిచారు. చాలా వేగంగా, చెట్టు కూడా ఊగిపోయేలా ఊగడం ప్రారంభించారు. వారి ధాటికి చెట్టూ అటూ ఇటూ ఊగిపోయింది. విరిగిపోతుందేమో అని కూడా అనిపించింది. అది ఎండిపోయిన చెట్టు కావడంతో ఏ క్షణంలో అయినా విరిగిపోయేలా ఉంది. ఆ చెట్టు గనుక విరిగిపోతే వారి పరిస్థితిని ఊహించుకోవడం కూడా కష్టమే. అయినా వారు ఎలాంటి భయమూ లేకుండా ఊగారు.
వారి చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్ష మంది వీక్షించారు. 5.5 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వారు మరణంతో ఆడుకుంటున్నారు``, ``వారికి అసలు భయమే లేదా``, ``వారు ఆ చెట్టు మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు సిసలైన పరీక్ష.. ఈ వ్యక్తుల మధ్యనున్న 3 అరటి పళ్లను కనుక్కోండి..
Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 21 , 2024 | 03:31 PM