ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో లీకేజీ.. షాకింగ్ వీడియో

ABN, Publish Date - Dec 20 , 2024 | 04:15 PM

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మార్గమధ్యంలో ఉండగా టాయి‌లెట్‌లో లీకేజీ కారణంగా సీట్ల మధ్యకు నీరు పోటెత్తడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మార్గమధ్యంలో ఉండగా టాయి‌లెట్‌లో లీకేజీ కారణంగా సీట్ల మధ్యకు నీరు పోటెత్తడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నీట మునిగి మరణిస్తామని వణికిపోయారు. డిసెంబర్ 7న డాలస్ నుంచి మినియాపొలిస్ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి (Viral).

Viral: డ్రోన్‌ కాఫ్టర్ తయారు చేసిన కుర్రాడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంస!


నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, టాయిలెట్‌లోని నీరు లీకై ప్రయాణికులు ఉండే క్యాబిన్లలోకి చొచ్చుకొచ్చేసింది. విమానం గాల్లో 30 వేల అడుగున ఎత్తున ఉండగా ఈ ఘటన జరిగింది. నీటి వరదను చూసి ప్రయాణికులందరూ కంగారు పడిపోయారట. విమానంలో ఉండగానే నీట మునిగి మరణిస్తామని కొందరు భయపడిపోయారట. అసలు విమానంలో అంత నీరు ఉంటుందా అనుకుంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!


అమెరికా మీడియా కథనాల ప్రకారం, విమానంలోని ఓ ప్రయాణికురాలు తొలుత బాత్రూమ్‌లో నీటి లీక్ గురించి విమానంలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. సిబ్బంది వచ్చి లీక్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో, పోటెత్తిన నీరు ప్రయాణికుల సీట్ల వద్దకు వచ్చేసింది. నీటిని ఆపలేకపోవడంతో సిబ్బంది కూడా కొంత తత్తరపాటుకు గురైనట్టు ప్రయాణికులు కొందరు చెప్పుకొచ్చారు. ఛీదర పుట్టేలా విమానంలో నీరు రావడంతో ప్రయాణికులు తమ సామాన్లు తడిసిపోకుండా చేతపట్టుకుని మరో చోటుకు వెళ్లారట. అయితే, అది మొత్తం మురుగునీరేనా అన్నది మాత్రం తెలియరాలేదు. విమానంలో టైటానిక్ సినిమాను ప్రదర్శిస్తున్న తరుణంలోనే ఈ ఘటన జరగడం కొందరికి అపశకునంగా కూడా తోచిందట.

Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!

ఇదిలా ఉంటే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూసి జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. టాయిలెట్ నీటిలో పడి మునిగిపోవడం అనేది అసంబద్ధమైన భయమని కొందరు కామెంట్ చేశారు. ఇక నీటి కారణంగా విమానంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువేనని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ చర్చనీయాంవం అవుతోంది.

Viral Video: బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప ఛెళ్లుమనిపించిన మహిళ!

Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..

Read Latest and Viral News

Updated Date - Dec 20 , 2024 | 04:29 PM