ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే..

ABN, Publish Date - Oct 14 , 2024 | 07:53 PM

కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్నకు సమాధానం జీవపరిణామ క్రమంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోడి కంటే గుడ్డే ముందొచ్చిందని స్పష్టం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్న సంక్లిష్టమైనది. దీనికి సమాధానం చెప్పలేక చాలా మంది ఈ ప్రశ్నను ఓ జోక్‌గా తీసుకుంటారు. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. జీవపరిణామక్రమానికి సంబంధించినది. అయితే, శాస్త్రవేత్తలకు దీనికి సమాధానం తెలిసిపోయింది. అందుకే, కోడి కంటే గుడ్డే ముందని వారు కుండ బద్దలు కొడుతున్నారు. ఇందుకు పెద్ద కారణమే ఉందంటున్నారు (Viral).

Viral: ఈ టిక్కెట్ ఎక్కడ దొరుకుతుంది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్


శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, జీవాల మనుగడకు గుడ్డు చాలా కీలకమైనది. ఇది ఓ జీవనాధార వ్యవస్థలా పనిచేస్తుంది. జన్యువైవిధ్యత అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుంది. అయితే, జీవపరిణామం తొలినాళ్లల్లో కనిపించిన గుడ్లకు నేటి గుడ్లకు అసలు పోలికే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో సముద్రంలో జెల్లీ ఫిష్‌లను పోలిన జీవాలు గుడ్లు పెట్టేవట. వాస్తవానికి సముద్రంలో పుట్టిన తొలి జీవులు మెల్లగా భూమ్మీద కాలుపెట్టాయి. ఆ తరువాత అవి పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులుగా అభివృద్ధి చెందాయి. కాబట్టి.. కోడి కంటే ముందే గుడ్డు వచ్చినట్టు భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుడ్లు ఉనికిలోకి వచ్చిన కొన్ని లక్షల ఏళ్ల తరువాత కోళ్లు పుట్టుకొచ్చాయని అంటున్నారు.

Viral: రూ.23 లక్షల శాలరీ వద్దంటూ.. రూ.18 లక్షల ప్యాకేజీవైపు మొగ్గు!


ఇక శునకాల్లాగే కోళ్ల పుట్టుకకూ మనిషే కారణమని శాస్త్రవేత్తల అంచనా. తోడేళ్లను మనుషులు మచ్చిక చేసుకుని కుక్కలను ఉనికిలోకి తెచ్చినట్టు కొన్ని అడవి పక్షులను కూడా మనుషులు మచ్చిక చేసుకున్నారట. మనుషుల మధ్య సంచరించేందుకు అలవాటు పడ్డ ఈ పక్షులు కాలక్రమంలో మనం చూస్తున్న సాధారణ కోళ్లుగా మారిపోయాయట. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, రెడ్ జంగల్ ఫౌల్ ను పోలిన ఓ అడవి పక్షి పెట్టిన గుడ్డు నుంచి సాధారణ కోళ్లు వచ్చాయి. అంటే, గుడ్డే ముందే వచ్చినట్టు భావించాలి. సుమారు 10 వేల ఏళ్ల క్రితం ఆధునిక కోళ్లు ఉనికిలోకి వచ్చినట్టు శాస్త్రవేత్తలు భావించేవారు. కానీ, అవి పుట్టి మూడు వేల ఏళ్లే అయ్యి ఉండొచ్చని తాజా ఆధారాలు చెబుతున్నాయి. మరోవైపు, మనకు పరిచయమైన గట్టిపెంకుల గుడ్లు డౌనోసార్ల కాలంలోనే ఉనికిలోకి వచ్చాయి. కాబట్టి, ఏ రకంగా చూసినా కోడి కంటే గుడ్డు ముందు వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..

Read Latest and Viral News

Updated Date - Oct 14 , 2024 | 08:01 PM