Share News

Rat Snacking: ర్యాట్ స్నాకింగ్ అంటే ఏమిటి? ఈ కొత్త ట్రెండ్ వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి..

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:49 PM

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ఫుడ్ ట్రెండ్ ర్యాట్ స్నాకింగ్ వల్ల ఆరోగ్యానికి చాలా అనర్థాలు ఉన్నాయట. అసలు ర్యాట్ స్నాకింగ్ అంటే ఏమిటి?

Rat Snacking: ర్యాట్ స్నాకింగ్ అంటే ఏమిటి? ఈ కొత్త ట్రెండ్ వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి..

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ఫుడ్ ట్రెండ్ పేరు.. ``ర్యాట్ స్నాకింగ్`` (Rat Snacking). ఆగండాగండి.. పేరును బట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. ఎలుకలకు ఈ ఆహారానికి ఎలాంటి సంబంధమూ లేదు. కాకపోతే.. ఎలుకలా తినడం అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు. భోజనం మాత్రమే కాకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిళ్లు (Snacks) తినడాన్ని ``ర్యాట్ స్నాకింగ్`` అంటారు. ఎలుకలు ఇలానే నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉంటాయి. అందుకే ఈ ట్రెండ్‌కు ఆ పేరు వచ్చింది. ఈ అలవాటుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు (Health Problems)ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనేవారు ఈ ర్యాట్ స్నాకింగ్‌కు అలవాటు పడతారట. ఒత్తిడి, భావోద్వేగాలను అణుచుకోలేక ఏదో ఒకటి తింటూ ఉంటారట. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేసే అలవాటు లేకపోయినా, భోజనం పూర్తిగా మానేసినా కూడా ఈ ర్యాట్ స్నాకింగ్‌ అలవాటు అవుతుంది. ఈ ర్యాట్ స్నాకింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయట (Side effects of Rat Snacking).


ర్యాట్ స్నాకింగ్ వల్ల అనర్థాలు:

rat1.jpg

సాధారణంగా స్నాక్స్ ఎక్కువ క్యాలరీలతో నిండి ఉంటాయి. పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు పెరగడానికి ఈ ర్యాట్ స్నాకింగ్ కారణమవుతుంది.

స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల భోజనం చేయడంపై దృష్టి ఉండదు. ఫలితంగా శరీరం విలువైన పోషకాలను కోల్పోతుంది. మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్‌స్టైల్ రోగాలు చుట్టుముడతాయి.

గ్యాస్ట్రిక్ వంటి ఉదర సంబంధ సమస్యలకు ఈ ర్యాట్ స్నాకింగ్ మూల కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయట తినే జంక్ ఫుడ్, పాస్ట్ ఫుడ్ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.


ర్యాట్ స్నాకింగ్‌ను ఎలా దూరం చేసుకోవాలి..

rat2.jpg

స్నాక్స్ తినే సమయంలో పూర్తి స్పృహతో ఉండాలి. ఏం తింటున్నారో, ఎందుకు తింటున్నారో పూర్తి అవగాహనతో ఉండాలి. ఒంటరిగా ఉండకుండా ఎవరితోనైనా మాట్లాడడానికి లేదా ఏదైనా పని చేయడానికి ప్రయత్నించాలి. ఒత్తిడిని, చిరాకును తగ్గించుకోవాలి. అతిగా తినడం వల్ల కలిగే అనర్థాలను ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.

Updated Date - Feb 03 , 2024 | 05:47 PM