ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhogi: భోగ భాగ్యాల భోగి.. భోగి పండగ విశిష్టత ఏంటీ..?

ABN, Publish Date - Jan 14 , 2024 | 12:27 PM

భోగ భాగ్యాల పండుగ భోగి. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి ఎక్కువగా ఉండటంతో భోగి మంటలు వేసుకుంటారు.

హైదరాబాద్: మకర సంక్రాంతి (Sankranthi) పండగ భోగితో (Bhogi) ప్రారంభం అవుతుంది. భోగ భాగ్యాల పండుగ భోగి. భోగి తర్వాత రోజు మకర సంక్రాంతి వస్తుంది. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి ఎక్కువగా ఉండటంతో భోగి మంటలు వేసుకుంటారు. సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాల నుంచి క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తాయి. భోగి (Bhogi) మంటలు వేయడంతో అవి ఇళ్లలోకి రావు.

భోగి మంటలు

సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. ఎండ వేడి పెరగడం ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేయడంతో వేడి తట్టుకునేలా శరీరం అలవాటు పడుతుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా వేస్తామో భోగి మంటలు కూడా అంతే నిష్టగా వేయాలి. సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి. కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతుంటారు. పిడకల మీద ఆవు నెయ్యితో మంటలు వేస్తే మంచిదని చెబుతారు. ఆ మంటలతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

భోగి పళ్లు

చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తుంటారు. రేగు పళ్లను తల మీద పోసి దీవిస్తారు. పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్లను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. రేగు పళ్లు, చెరకు గడలు, బంతిపూలు, చిల్లర నాణేలను భోగి పండ్లను వాడతారు.

సూర్యుడి ఆశీస్సులు

రేగు పళ్లను బదరీఫలాలని అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తారు. వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని పురాణాల్లో రాసి ఉంది. ఆ ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోస్తుంటారు. రేగు పళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని భోగి పళ్లను పోస్తుంటారు.

మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 12:27 PM

Advertising
Advertising