ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganapati bappa Morya: మోరియా అంటే ఏమిటి.?

ABN, Publish Date - Sep 13 , 2024 | 04:26 PM

గణేశ్ చతుర్థి వేడుకల్లో కచ్చితంగా వినిపించే నినాదం. గణపతి బప్పా మోరియా. మరి మోరియా అంటే ఏమిటో? ఈ పదం ఎలా ఉనికిలోకి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదనే చెప్పాలి. అసలు.. మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం (Ganapathi Bappa Morya).

గణనాథుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు?


మోరియా అసలు కథ

15వ శతాబ్దంలో ‘మోరియా గోసావి’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పూణెకు 21 కి.మీ. దూరంలో చించ్‌వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్‌వాడి నుంచి మోరేగావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.

Hyderabad: ఖైరతాబాద్‌ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..


ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడని భావించారు. ఆయనను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. ఆయన పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. ఇలా నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను మోరియా తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు బాగమైపోయింది.

శివశివ మూర్తివి గణనాథా..


ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని మరాఠీ లో నినదిస్తారు. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి ఈ నినాదాలు చేస్తాడు. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.

గణనాథుడికి ఈ 7 స్వీట్స్ నైవేద్యంగా పెడితే లైఫ్‌లో విజయం!

Read Latest and Viral

Updated Date - Sep 13 , 2024 | 04:32 PM

Advertising
Advertising