ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఫ్రిడ్జ్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటో అని వెనక్కి తిప్పి చూసిన ఇంటి వారికి దిమ్మదిరిగే షాక్!

ABN, Publish Date - Jul 29 , 2024 | 01:56 PM

ఏ వ్యక్తి అయినా తన ఇంటిని సురక్షితమైనదిగా భావిస్తాడు. ఎలాంటి భయమూ, అనుమానమూ లేకుండా ఇంట్లో తిరుగుతాడు. అలాంటిది ఇంట్లో కూడా ప్రమాదాలు ఎదురైతే ఏం చేస్తాడు? ప్రతిదానిని అనుమానంగా చూస్తాడు. ఇటీవల ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

King Cobra Snake Video

ఏ వ్యక్తి అయినా తన ఇంటిని (Home) సురక్షితమైనదిగా భావిస్తాడు. ఎలాంటి భయమూ, అనుమానమూ లేకుండా ఇంట్లో తిరుగుతాడు. అలాంటిది ఇంట్లో కూడా ప్రమాదాలు ఎదురైతే ఏం చేస్తాడు? ప్రతిదానిని అనుమానంగా చూస్తాడు. ఇటీవల ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. వంటింట్లో నుంచి వస్తున్న వింత శబ్దాలు ఆ కుటుంబ సభ్యుులకు చెమటలు పట్టించాయి. ఫ్రిడ్జ్‌ (Refrigerator)ను వెనక్కి తిప్పి చూసిన వారికి కళ్లు బైర్లు కమ్మాయి. ఓ భారీ నాగుపాము (Cobra) ఆ ఫ్రిడ్జ్ వెనుకాల దాక్కుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


sarpmitra.akashjadhav అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ భయంకర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ప్రమాదకర నాగుపాము ఫ్రిడ్జ్ వెనుక ఉండే చట్రాల్లో దాక్కుని ఉంది. ఇంటి వారు దానిని గమనించి నిపుణులను పిలిచారు. వారు ఆ పామును బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నాగుపాము తన పడగ విప్పి బుసలు కొడుతోంది. అక్కడి నుంచి బయటకు రావడానికి మొండికేస్తోంది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి``, ``పొలాల పక్కన, చెట్లు ఎక్కువగా ఉండే ఇళ్ల వారికి ఇలాంటివి తప్పవు``, ``ఆ నాగుపాము చాలా కోపంగా ఉంది``, ``వారు చాలా అదృష్టవంతులు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Zomato: పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసిన కస్టమర్.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్.. జొమాటో రియాక్షన్ ఏంటంటే..


Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!


Viral Video: ఇంత పిచ్చి ఏంటి అమ్మా.. పిల్లాడిని ఎత్తుకుని రీల్స్ కోసం డ్యాన్స్.. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Jul 29 , 2024 | 01:56 PM

Advertising
Advertising
<