Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ సమయంలో వస్తుంది.. ఏ మంత్రాలు జపించాలి
ABN, Publish Date - Aug 22 , 2024 | 01:21 PM
ప్రతి ఏటా భాద్రపద కృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది. శుభ సమయం ఎప్పుడు, ఏ మంత్రం జపించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి(Sri Krishna Janmashtami) పండుగను ప్రతి ఏటా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. ఆ సమయంలో వృషభరాశిలో చంద్రుడు ఉన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది. పూరీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్య నిపుణులు గణేష్ మిశ్రా శుభ సమయం, మంత్రం గురించి ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
2024 జన్మాష్టమి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(sri krishna janmashtami 2024) పండుగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోనున్నారు. ఈ ఏడాది శ్రీ కృష్ణ భగవానుడి 5,251వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 12.44 గంటల వరకు కృష్ణ జన్మాష్టమికి పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది.
ఇలా చేస్తే
ఈ నేపథ్యంలో భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ఆగస్టు 26, 2024న శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర, బృందావన్‌లో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడం ద్వారా దుఃఖం, దోషం, దారిద్ర్యం తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఈ రోజున భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ కృష్ణుడిని పూజిస్తారు. వ్రతాన్ని ఆచరించి బాలగోపాల్‌ను అందంగా అలంకరించి, ప్రసాదాలు పెడతారు.
పూజా మంత్రం
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడానికి మీరు రెండు మంత్రాలను ఉపయోగించవచ్చు. ఈ మంత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
2. ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః
సంతానం లేని వారికి
శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. విష్ణువు అవతారంగా భావించే శ్రీకృష్ణుడికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. భాదో మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు. సంతానం లేని దంపతులకు జన్మాష్టమి పండుగ చాలా ముఖ్యమైనది. సంతానం లేనివారు జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండి లడ్డూ గోపాలుడిని పూజించాలని చెబుతుంటారు. అలా చేస్తే ఆయన దయవల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇవి కూడా చదవండి..
Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..
Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..
Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 22 , 2024 | 01:23 PM