Share News

Ram Mandir: అయోధ్య రామ మందిర విరాళాలు.. భారీ కానుకలు సమర్పించిన వారు ఎవరెవరంటే..

ABN , Publish Date - Jan 22 , 2024 | 08:42 PM

దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఎంతో మంది కల నెరవేరింది. అతిరథుల మహారథుల సమక్షంలో బాల రాముడు అయోధ్యలో కొలువు దీరాడు.

Ram Mandir: అయోధ్య రామ మందిర విరాళాలు.. భారీ కానుకలు సమర్పించిన వారు ఎవరెవరంటే..

దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట (Ram Temple Pran Pratishtha) కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఎంతో మంది కల నెరవేరింది. అతిరథుల మహారథుల సమక్షంలో బాల రాముడు అయోధ్య (Ayodhya)లో కొలువు దీరాడు. ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది చేతులు కలిపారు. తమకు తోచినంత సహాయ సహకారాలు అందించారు. దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు (Donations) సమర్పించారు. వారిలో బడా వ్యాపారుల నుంచి కూలీల వరకు అందరూ ఉన్నారు.

సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపూ రూ.11.3 కోట్లు రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్ డోలాకియా రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించారు. అలాగే అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో నివసిస్తున్న రామ భక్తులందరూ కలిసి రూ.8 కోట్లు ఇచ్చారట. ఇక, దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లను విరాళాలుగా సేకరించారట. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Updated Date - Jan 22 , 2024 | 08:42 PM