Share News

మిణుగురుల ప్రపంచంలోకి...

ABN , Publish Date - Mar 02 , 2025 | 01:40 PM

రాత్రిళ్లు ఆకాశంలోని నక్షత్రాలు భూమి మీద వాలాయా అన్నట్టుగా ఉంటుంది మెరిసే మిణుగురుల్ని చూస్తే. మనదేశంలో వీటిని అంతగా పట్టించుకోం గానీ... ఫిలిప్పీన్స్‌, జపాన్‌ లాంటి దేశాల్లో ఏకంగా మిణుగురు యాత్రలే నిర్వహిస్తున్నారు.

మిణుగురుల ప్రపంచంలోకి...

రాత్రిళ్లు ఆకాశంలోని నక్షత్రాలు భూమి మీద వాలాయా అన్నట్టుగా ఉంటుంది మెరిసే మిణుగురుల్ని చూస్తే. మనదేశంలో వీటిని అంతగా పట్టించుకోం గానీ... ఫిలిప్పీన్స్‌, జపాన్‌ లాంటి దేశాల్లో ఏకంగా మిణుగురు యాత్రలే నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో తప్ప మిగతా కాలాల్లో ఈ ‘ఫైర్‌ఫ్లైస్‌ టూర్స్‌’ అందుబాటులో ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లోని బోహో, పాలవాన్‌, సిక్విజార్‌ ద్వీపాలు మిణుగురుల బోట్‌ టూర్లకు ప్రసిద్ధి.


aaaa.jpg

రాత్రి వేళల్లో అక్కడి నదుల్లో పడవ విహారం ఓ అబ్బురం అయితే, చెట్లపై మిలమిలా మెరిసే వేలాది మిణుగురులను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ ఫైర్‌ఫ్లైస్‌ టూర్లకు సరైన సీజన్‌ మార్చి నుంచి మే. ఈ సమయంలో అక్కడ టూరిస్టుల హడావుడి కాస్త ఎక్కువే. పారిశ్రామిక కాలుష్యం కారణంగా రానురాను మిణుగురుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే కాబోలు... వాటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 01:40 PM