ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: లైఫ్‌లో సంతృప్తి లేదని 54 లక్షల జీతమిచ్చే జాబ్‌కు రాజీనామా! చివరకు..

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:06 PM

ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్ ఇచ్చేందుకు రూ.54 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్న ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడి ధైర్యానికి నెట్టింట ప్రశంసలు కురుస్తు్న్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: సొంత సంస్థను ఏర్పాటు చేసి విజయాల బాట పట్టించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. పరాంతప్ చౌదరి సరిగ్గా ఇదే పని చేశాడు. స్క్వేర్ యార్డ్స్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా రూ.54 లక్షలు తీసుకునే ఆయన.. జీవితంలో సంతృప్తి లేదంటూ రాజీనామా చేశారు. తన సొంత వ్యాపారం ప్రారంభించేందుకు, కోల్పోయిన బంధాలను తిరిగి పునర్నిర్మించేందుకు ధైర్యంగా ముందడుగు వేశారు. రిజైన్ చేసిన మూడు నెలల తరువాత తన జీవితం ఎలా ఉందో చెబుతూ ఆయన పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: మంటలు అంటుకున్న పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. షాకింగ్ సీన్


‘‘నేను బైజూస్, స్క్వేర్ యార్డ్స్ వంటి సంస్థల్లో పని చేశా. గత ఏడేళ్లల్లో రెండు స్టార్టప్ సంస్థల ఎదుగుదలలో కీలక భూమిక పోషించా. సగం సమయం వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో నేర్చుకుంటూ మిగతా సమయం ప్రణాళికలను అమల్లో పెడుతూ గడిపేశా. ఈ ఆరేళ్లల్లో నాకు ఆరు సార్లు ప్రమోషన్ లభించింది. నేను పనిచేసిన సంస్థలకు రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చా. 5 వేల మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు ట్రెయినింగ్ ఇచ్చా. భారీ సేల్స్ బృందానికి నాయకత్వం వహించా. కానీ ఇలా నిరంతరంగా పనిచేయడంతో నాలో తెలీకుండానే అలసట ప్రవేశించింది’’ అని చెప్పుకొచ్చారు (Why A Rs 54 Lakh A Year Job Wasnt Enough For This Man).

‘‘ప్రస్తుతం నేను ఫ్రీలాన్సర్‌గా ఇతర సంస్థలు తమ డిజిటల్ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు సలహాలు ఇస్తున్నా. స్టార్టప్‌ల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరికీ అందుబాటులో ఉంటున్నా. నేను ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉండి ఉంటే ఈ మూడు నెలల్లో రూ.9 లక్షలు సంపాదించే వాణ్ణి. ప్రస్తుతం అందులో పది శాతం కూడా సంపాదించలేదు. కానీ, మునుపెన్నడూ లేని విధంగా నేను జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. డబ్బుతో కొన్నింటికి ఎప్పటికీ కొనలేమని నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు.


పరాంతప్ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నచ్చిన జీవితం కోసం జీతం వదులుకునేందుకు చాలా ధైర్యం కావాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అభివృద్ధి పథంలో సాగిపోతున్నావంటూ మరో వ్యక్తి అభినందించారు. నేటి ప్రయాణం ఏదోక రోజు అద్భుత ఫలితాలు ఇస్తుందని మరో వ్యక్తి తెలిపారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 06 , 2024 | 01:06 PM

Advertising
Advertising