Viral: బీర్ సీసాలు ముదురు గోధుమ రంగులోనే ఉంటాయ్! ఇలా ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Nov 15 , 2024 | 09:47 PM
బీర్ సీసాలన్నీ సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. మరి సీసాలకు ఈ రెండు రంగులే వినియోగించడానికి కారణం ఏమై ఉంటుందో అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీ కోసమే..
ఇంటర్నెట్ డెస్క్: బీర్ సీసాలన్నీ సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. మరి సీసాలకు ఈ రెండు రంగులే వినియోగించడానికి కారణం ఏమై ఉంటుందో అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీ కోసమే (Viral)..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, బీర్ ను గాజు సీసాల్లో ప్యాక్ చేసే సంప్రదాయం 19వ శతాబ్దంలో మొదలైందట. బీర్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు గాజు సీసాలే అనువైనవని గుర్తించాక అనేక మంది ఈ పద్ధతి వైపు మళ్లారట. అయితే, పారదర్శకంగా ఉండే గాజు సీసాల్లోని బీర్ త్వరగా పాడవుతున్న విషయం కూడా ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. పారదర్శక సీసాల్లోని బీర్‌కు సూర్యరశ్మీ తగలడంతో దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. బీర్‌లో ఐసోహ్యుములోన్స్ అనే రసాయనాలు ఉంటాయి. వీటికి సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు తగిలినప్పుడు అవి దుర్వాసన వెదజల్లే రసాయనాలుగా మారిపోతాయట. ఈ క్రమంలో బీర్ రుచిలో కూడా మార్పు వస్తుందట.
Viral: టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందుకెళ్లట్లేదా? కారణాలు ఇవే!
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. పారదర్శక సీసాలకు బదులు ముదురు గోధుమ రంగు సీసాలను వినియోగించడం మొదలెట్టారు. ముదురు గోధమ రంగు సూర్యరశ్మిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఈ రంగు సీసాలను వినియోగించడం మొదలెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు.
అయితే, రెండో ప్రపంచ యుద్ధంలో ముదురు గోధుమ రంగు సీసాల కొరత ఏర్పడింది. దీంతో, బీర్ కంపెనీలు ఆకుపచ్చ రంగు బాటిళ్లవైపు మళ్లాయి. ఈ క్రమంలో ప్రీమియం బ్రాండ్స్ బీర్‌లు ఆకుపచ్చ రంగు బాటిళ్లల్లో ఉంటాయన్న పేరు స్థిరపడింది. ఆ తరువాత కంపెనీలు అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపడంతో ఇప్పటికీ ఆకుపచ్చ బీర్ సీసాలు లభ్యమవుతున్నాయని చెబుతున్నారు.
Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్!
అయితే, అతినీలలోహిత కిరణాలనున అడ్డుకునే పారదర్శక బీర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయట. యూవీ కాంతిని అడ్డుకునేందుకు ఈ బాటిల్స్‌పై ప్రత్యేక రసాయనం పూస్తారని నిపుణులు చెబుతున్నారు. దీంతో, లోపులున్న బీర్ వినియోగదారులకు స్పష్టంగా కనబడటంతో పాటు యూవీ కాంతి సమస్య కూడా తొలగిపోయిందని చెబుతున్నారు. అతినీలలోహిత కాంతి నుంచి 100 శాతం రక్షణ ఇచ్చే మెటల్ క్యాన్స్ కూడా ప్రాచుర్యం పొందాయి. బహిరంగ ప్రదేశాల్లో పార్టీలకు అనువుగా క్యాన్స్ ఉండటం కూడా వీటి పాప్యులారిటీ పెరగడానికి కారణమని చెబుతున్నారు.
Updated Date - Nov 15 , 2024 | 09:55 PM