ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mirrors in the Lift: లిఫ్టు‌ల్లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:58 PM

క్లాస్ట్రోఫోబియా, భద్రత తదితర కారణాల రీత్యా లిఫ్టుల్లో అద్దాలు అమర్చుతారని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: షాపింగ్ మాల్స్, పెద్ద భవంతుల్లో లిఫ్టులోపల కచ్చితంగా అద్దాలు అమరుస్తారు. వీటిల్లో చూసుకుంటూ జనాలు తమ జుట్టు సరిచేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, అద్దాలు అమర్చడం వెనక శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం (Mirrors in the Lifts).

Viral: భూమ్మిద నూకలు ఇంకా మిగిలుండటం అంటే ఇదే! షాకింగ్ వీడియో!


క్లాస్ట్రోఫోబియా..

చాలా మందికి చిన్న చిన్న గదుల్లో ఉండేందుకు భయపడతారు. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. అయితే లిఫ్టులో కూడా ఇలాంటి అద్దాలు అమర్చడం వల్ల దాని పరిమాణం మరింత పెద్దదిగా ఉన్న భ్రమ కలుగుతుంది. దీంతో, క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్లు ఎటువంటి భయాందోళన చెందకుండా లిఫ్టు వాడుకుంటారు.

జనాల దృష్టి మరల్చేందుకు కూడా లిఫ్టుల్లో అద్దాలు అమర్చుతారు. అద్దంలో తమ ముఖం చూసుకుంటూ, జుట్టు లేదా మేకప్ సరిచేసుకుంటూ గడిపేసే జనాలు తాము చిన్న ప్రదేశంలో ఉన్నామన్న భయం నుంచి బయటపడతారు.

భద్రతా కారణాల వల్ల కూడా లిఫ్టుల్లో అద్దాలు అమర్చుతారు. దీని వల్ల వెనక ఉన్న వారు ఏం చేస్తున్నారనేది తలతిప్పకుండానే ఓ కంట కనిపెట్టొచ్చు.

వీల్‌చైర్‌లో ఉన్న వాళ్లు సులభంగా లిఫ్టులో కదిలేందుకు వీలుగా ఈ అద్దాలు ఉపయోగపడతాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

Viral: వాహనదారుడికి షాకింగ్ అనుభవం! జోరు వానలో బయటకు రావద్దనేది ఇందుకే..


అయితే, లిఫ్టుల్లో అద్దాలు అమర్చడం వెనక ఓ ఆసక్తికర కథనం కూడా ప్రచారంలో ఉంది. లిప్టులు కనుగొన్న రోజుల్లో జనాలు ఎన్నో ఫిర్యాదులు చేసేవాళ్లట. అది నెమ్మదిగా వెళుతోందని విసుక్కునే వాళ్లట. పెద్ద క్యూ ఉంటోందని చెప్పేవారట. ఓ హోటల్ మేనేజర్‌కు ఇలాగే విమర్శలు వెల్లువెత్తడంతో అతడు విసిగిపోయాడట. అయితే లిఫ్ట్ వేగం పెంచాలంటే డబ్బు ఖర్చు చేయాలి. దీంతో, మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తుండగా సిబ్బందిలో ఒకరు అద్దాలు అమర్చాలన్న సలహా ఇచ్చారు. జనాలు తమని తాము చూసుకోవడంలో పడి ఫిర్యాదుల గురించి మర్చిపోతారని భావించారు. వారి అంచనా నిజం అవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంబించడం ప్రారంభించారట.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!

Read Latest and Viral News

Updated Date - Oct 17 , 2024 | 10:35 PM