Sleep Divorce: స్లీప్ డైవర్స్.. యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్!
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:13 PM
పర్యటన సందర్భంగా ఈ మధ్య అనేక మంది జంటలు వేర్వేరు గదుల్లో ఒంటరిగా పడుకునేందుకు ఇష్టపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. స్లీప్ డైవర్స్‌గా పేరుపడ్డ ఈ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంటోందని సర్వే వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: పర్యటనలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. ప్రజలు వారి వారి స్తోమతలను బట్టి స్థానిక పర్యాటక స్థలాలు మొదలు విదేశీ టూరిస్టు ప్రదేశాల వరకూ వివిధ రకాల ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అయితే, ఇలా రోజుల తరబడి టూర్లల్లో పాల్గొనే యువ జంటల్లో ఇటీవల కాలంలో ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. జీవిత భాగస్వాములు లేదా తమ మనసుకునచ్చిన వారితో టూర్లకు వెళుతున్న వాళ్లు పర్యాటక ప్రాంతాల్లో మాత్రం వేర్వేరు గదుల్లో నిద్రించేందుకు ఇష్టపడుతున్నారట. కొందరు పిల్లలకు, జీవత భాగస్వాములకు కూడా వేర్వేరు గదులు బుక్ చేస్తున్నారు. దీంతో, ఈ ట్రెండ్ ‘స్లీప్ డైవర్స్’గా పాప్యులారిటీ సాధించింది (Viral).
Viral: ఇంతకు తెగించారేంట్రా దేవుడా! ఈ యువతులు చేసిన దారుణం చూస్తే..
ఏమిటీ స్లీప్ డైవర్స్!
ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కమ్మటి నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్ చేశామని కూడా చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట.
Viral: ఇక్కడకొచ్చి తప్పు చేశానేమో! న్యూజిలాండ్‌లో భారతీయ యువకుడి ఆవేదన
ఈ ట్రెండ్‌పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా నిద్రిస్తున్నట్టు పర్యటనలకు వచ్చిన అనేక జంటలు చెప్పుకొచ్చాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకులు అంచనా వేశారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్‌లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు.
Viral: ఈసారి లాటరీ గెలుస్తానని జోక్ చేశాడు! చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!
Updated Date - Oct 25 , 2024 | 10:45 PM