Viral: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు ఇంధనాన్ని జారవిడిచే విమానాలు! ఎందుకంటే..
ABN, Publish Date - Oct 22 , 2024 | 09:26 PM
అత్యవసర సందర్భాల్లో పైలట్లు విమానంలోని ఇంధనంలో చాలా భాగాన్ని గాల్లో ఉండగానే జార విడిచేస్తారు. దీన్ని ఫ్యూయెల్ డంపింగ్ అంటారు. ల్యాండింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇలా చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని కూడా వివరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో భారీ స్థాయిలో ఇంధనం నింపుతారు. కొన్ని విమానాలు ఏకంగా 5 వేల గ్యాలన్ల వరకూ ఇంధనాన్ని తమ ఫ్యుయెల్ టాంకుల్లో నింపుకుని బయలుదేరతాయి. ఇది దాదాపు మూడు ఏనుగుల బరువుకు సమానం. కానీ అత్యవసర సందర్భాల్లో ఈ ఇంధనంలో చాలా భాగాన్ని విమానాలు గాల్లో ఉండగానే జార విడిచేస్తాయి. దీన్నే ఫ్యూయెల్ డంపింగ్ అని అంటారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందర్భంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో ఇంధనంలో చాలా భాగాన్ని ఇలాగే వదిలించుకున్నారు. మరి ఇంతటి విలువైన ఇంధనాన్ని పైలట్లు గాల్లో ఉండగానే ఎందుకు పారబోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం (Viral).
Viral: కార్పొరేట్ ప్రపంచం అంటే ఇదీ! ఈ వ్యక్తి జాబ్ ఎలా పోయిందో చూస్తే..
సాధారణంగా విమానం టేకాఫ్ చేసేటప్పుడు ఎంత బరువు ఉండాలి? ల్యాండింగ్ చేసేటప్పుడు ఎంత బరువు ఉండాలి? అనే విషయాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. విమానాలు భద్రంగా ల్యాండవ్వాలంటే ఇవి పాటించడం తప్పనిసరి. ఏ చిన్న తేడా వచ్చి భారీ ప్రమాదం సంభవిస్తుంది. అందుకే పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం బరువు పరిమితికి లోబడి ఉండేలా జాగ్రత్త పడతారు. తప్పదనుకుంటే విమానంలో ఇంధనాన్ని గాల్లో ఉండగానే జారవిడుస్తారు. దీంతో, విమానం బరువు తగ్గి ల్యాండింగ్ సులువవుతుంది(Pilots dumping fuel).
Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..
విమానం ఇంధనాన్ని దాని రెక్కల్లో నిల్వచేస్తున్నారు. కాబట్టి, ఇంధాన్ని వేగంగా కిందకు పారబోసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. పైలట్ స్విచ్ ఆన్ చేయగానే రెక్కల చివర్లలో ఉన్న నాజిల్స్ తెరుచుకుని ఇంధాన్ని వేగంగా పారబోస్తాయి. క్షణాల్లో వేలకొద్దీ లీటర్ల ఇంధనాన్ని వదిలించుకునే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుంది. చాలా సందర్భా్ల్లో పైలట్లు విమానాన్ని గాల్లో చక్కెర్లు కొట్టి ఇంధనాన్ని ఖర్చు చేస్తారు. అంతసమయం లేని సందర్భాల్లో ఫ్యూల్ డంప్ చేస్తారు. అయితే, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం కనీసం 6 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే ఇంధనాన్ని జారవిడుస్తారు. దీంతో, ఇంధనం కిందపడకుండా గాల్లోనే ఆవిరైపోతుంది. అయితే, ఈ ఫ్యూల్ డంపింగ్ వ్యవస్థ అన్ని విమానాల్లో ఉండదట. బోయింగ్ 777, 747 లాంటి భారీ మోడళ్లలోనే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. గరిష్ఠ బరువుతో ల్యాండింగ్ చేయగలిగేలా డిజైన్ చేసిన బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల్లో ఈ వ్యవస్థ ఉండదని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Oct 22 , 2024 | 09:31 PM