Mineral Water: మినరల్ వాటర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు? ఆ తరువాత తాగితే ఏమవుతుంది?
ABN, Publish Date - Mar 17 , 2024 | 05:59 PM
మినరల్ వాటర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉండటానికి కారణం ఏంటో సవివరమైన సమాధానం చెప్పిన నిపుణులు
ఇంటర్నెట్ డెస్క్: మనందరం మినరల్ వాటర్ (Mineral Water) ఎప్పుడోకప్పుడు కొనే ఉంటాం. దాని మీద ఎక్స్‌పైరీ డేట్‌ను (Expiry Date) చూసి మరీ కొనుక్కుంటాం. అసలు మంచి నీళ్లు, అది కూడా పూర్తిగా శుభ్రపరిచి బాటిల్‌లో నింపిన నీరు ఎందుకు పాడవుతుందనే సందేహం చాలా మందికి కిలిగే ఉంటుంది. అనేక మంది ఇలాంటి సందేహాలను నెట్టింట్లో పంచుకుంటారు కూడా! మరికొందరు సమాధానాలు కూడా ఇస్తుంటారు! అయితే నిపుణులు మాత్రం దీని వెనక చాలా ముఖ్యకారణమే ఉందని చెబుతున్నారు.
Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..
నిపుణుల చెప్పే దాని ప్రకారం, ఈ ఎక్స్‌పైరీ డేట్‌కు కారణం ప్లాస్టిక్ బాటిల్. సాధారణంగా ఈ బాటిల్స్‌ను పాలీఇథిలీన్ టెరీ థాలేట్ అనే ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిపై ఎండపడినప్పుడు ఈ ప్లాస్టిక్ సూక్ష్మరూపంలో నీళ్లోకి విడుదల అవుతుంది. దీర్ఘకాలం పాటు బాటిల్‌లో నీళ్లు అలాగే ఉంటే అందులో ప్లాస్టిక్ శాతం పెరుగుతుంది. ఇలాంటి నీటిని తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మినరల్ వాటర్ బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్‌ను ముద్రిస్తారు.
ఇక ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన మంచి నీళ్లు తాగితే పలు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రిప్రొడక్టివ్ సమస్యలు, మెదడు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Viral: రిఫండ్ ఇచ్చినా ఫ్లిప్‌కార్ట్‌ను వదిలిపెట్టని కోర్టు.. కస్టమర్‌ను వేధించినందుకు భారీ షాక్!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 17 , 2024 | 06:05 PM