Diesel Bikes: ప్రపంచంలో డీజిల్ బైకులు ఎందుకు లేవో తెలుసా?
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:16 PM
డీజిల్ బైకులు లేకపోవడానికి కారణం ఇదే..
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్‌పై నడిచే కార్లతో పాటూ డీజిల్ వేరియంట్లు కూడా బోలెడన్నీ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిపై నిషేధం విధిస్తున్నారు. అయితే, బైకుల్లో మాత్రం మనకు డీజిల్ వేరియంట్లు (Diesel Bikes) కనిపించవు. ఎందుకిలా అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీ కోసమే!
Viral Video: యువకుడిపై పగ తీర్చుకున్న తేనెటీగల దండు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం
వాస్తవానికి బైకులకు అనువైన డీజిల్ ఇంజిన్ తయారు చేయడం అంత పెద్ద విషయేమీ కాదు. అంతేకాదు, డీజిల్ ఇంజిన్లు పెట్రోల్‌తో పోలిస్తే కొంత మెరుగైనవని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు డీజిల్ ఇంజిన్ (Diesel Engine) సామర్థ్యం ఎక్కువ. అంతేకాదు, వీటితో కర్బన ఉద్గారాలు కూడా తక్కువే. ఇక వాహనం కదిలేందుకు అవసరమైన టార్క్ శక్తి కూడా డీజిల్ ఇంజిన్‌కే ఎక్కువ. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నా డీజిల్ ఇంజెన్లు మాత్రం కనిపించవు (Why there are no diesel bikes). దీని వెనక పెద్ద కారణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Viral: కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే.. షాకింగ్ వీడియో.. భారతీయుల ఆగ్రహం
మెకానికల్ ఇంజినీర్లు (Mechanical Engineers) చెప్పేదేంటంటే.. పెట్రోల్ ఇంజిన్ కంటే డీజిల్ ఇంజిన్ బరువైనది. ఇందులో విడిభాగాలు ఎక్కువగా ఉండటమే కారణం. ఇంజిన్‌ను చల్లబరిచేందుకు అధునాతన కూలింగ్ వ్యవస్థ అవసరం కావడంతో విడిభాగాల సంఖ్య పెరిగి చివరకు ఇంజిన్ బరువుగా మారుతుంది. ఇంజెన్ బరువు పెరగంతో వాహనం వేగం తగ్గిపోతుంది. బైకులు తోలడం ఈజీగా ఉండాలని కస్టమర్లు కోరుకుంటారు కాబట్టి డీజిల్ ఇంజెన్లు బైకులను అనువైనవి కావట.
అంతేకాదు, వీటి నిర్వహణ, రిపేర్ల ఖర్చులు కూడా వినియోగదారులకు భారంగా మారతాయనిపుణులు చెబుతున్నారు. డీజిల్ ఇంజిన్ చేసే పెద్ద శబ్దాలు, అందులోని వైబ్రేషన్లు కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఈ శబ్దాలు బైక్ నడిపే వారికి చిరాకు పెడతాయి. ఇతర వాహనదారులకూ ఇబ్బందిగా మారొచ్చు. ఈ కారణాల రీత్యా ఆటోమొబైల్ సంస్థలు డీజిల్ బైక్ జోలికి వెళ్లలేదట.
1990ల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ టారస్ పేరిట ఓ డీజిల్ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే, , దీని నిర్వహణ వ్యయాలు ఎక్కువ ఉన్నాయంటూ ఫిర్యాదులు రావడం, కస్టమర్లలో క్రమంగా ఆసక్తి తగ్గడంతో సంస్థ ఈ బైకుల ఉత్పత్తిని నిలిపివేసింది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి