మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Agra: భార్య వాట్సాప్ స్టేటస్ చూసి వణికిపోయిన భర్త.. ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తించి..

ABN, Publish Date - Mar 31 , 2024 | 08:06 PM

భార్య వాట్సాప్ స్టేటస్ చూసి భయపడిపోయాడో భర్త. తన ప్రమాణానికి ముప్పు పొంచి ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Agra: భార్య వాట్సాప్ స్టేటస్ చూసి వణికిపోయిన భర్త.. ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తించి..

ఇంటర్నెట్ డెస్క్: భార్య వాట్సాప్ స్టేటస్ చూసి భయపడిపోయాడో భర్త. తన ప్రమాణానికి ముప్పు పొంచి ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగ్రాలో (Agra) వెలుగు చూసిన ఈ ఉదంతం (Crime) ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, బాధితుడికి 2022 జులై 9న మధ్యప్రదేశ్ (Madhyapradesh) భిండ్ జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. ఐదు నెలల పాటు వారి మధ్య గొడవలు కొనసాగడంతో చివరకు యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె భర్త నుంచి భరణం కోరుతూ కేసు కూడా పెట్టింది.

Birthday Cake: బర్త్‌డే వేడుకలో విషాదం.. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక దుర్మరణం


గతేడాది తాను భార్య స్వగ్రామం నుంచి తిరిగివస్తుండగా ఆమె కుటుంబసభ్యులు తనను చంపేస్తానని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత భార్య వాట్సాప్ చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించిందన్నారు. తన భర్తను చంపిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ ఆమె ఏకంగా స్టేటస్‌లోనే ఆఫర్ ఇచ్చిందని వాపోయాడు (Reward for Killing husband). తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో అతడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

కాగా, తన భార్యకు పెళ్లికి ముందే తన పొరుగింట్లో అద్దెకు ఉండే వ్యక్తితో ఎఫైర్ ఉందని బాధితుడు ఆరోపించాడు. తమ మధ్య తగవులకు కూడా అదే కారణమని అన్నాడు. భార్య బాయ్‌ఫ్రెండ్ తనను చంపుతానంటూ ఫోన్లో బెదిరించాడని అన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్యపై కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు.

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 08:06 PM

Advertising
Advertising