పెంపుడు జంతువులకు ప్రేమతో...
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:50 AM
ఇంటి కోసమో, పిల్లల కోసమో, గార్డెన్ కోసమో కాకుండా... పెంపుడు జంతువుల కోసం కూడా అనేక గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఉదాహరణకు వాటి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలన్నా, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసు కోవాలన్నా ఇకపై క్షణాల్లో పనే.
ఇంటి కోసమో, పిల్లల కోసమో, గార్డెన్ కోసమో కాకుండా... పెంపుడు జంతువుల కోసం కూడా అనేక గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఉదాహరణకు వాటి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలన్నా, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసు కోవాలన్నా ఇకపై క్షణాల్లో పనే.
భలే బ్యాగు
షాపింగ్, వాకింగ్, హైకింగ్... ఎక్కడికెళ్లినా ఇకపై పెంపుడు జంతువులను ‘పెట్స్ క్యారియర్ బ్యాగ్’లో వేసుకుని వెళ్లొచ్చు. వీటిని ఉపయోగించడం తేలికే. దీని లోపల పెట్‌ను ఉంచి జిప్ వేసేసి, ఎంచక్కా భుజానికి తగిలించుకోవచ్చు. పెట్‌కి గాలి, వెలుతురు అందేలా బ్యాగ్ చుట్టూ రంధ్రాలు కూడా ఉంటాయి. బ్యాగ్ సైడ్ ప్యాకెట్‌లో పెట్‌కి కావాల్సిన స్నాక్స్ లేదా వాటర్ బాటిల్ ఉంచొచ్చు.
పాదాలకు రక్షణ
పిల్లి పాదాల రక్షణకూ షూస్ వచ్చేశాయి. రాళ్లు, గాజుముక్కల వంటివి గుచ్చుకోకుండా పిల్లుల పాదాలకు ఇవి పూర్తి రక్షణను ఇస్తాయి. ఎండాకాలంలోనూ కాళ్లు కాలవు. సిలికాన్ మెటీరియల్‌తో తయారైన ఈ షూస్ పూర్తిగా వాటర్ ప్రూఫ్. వివిధ సైజుల్లో, విభిన్న రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
స్ప్రిక్లర్... నో టెన్షన్
ఒక్కోసారి గార్డెన్‌లో స్ప్రిక్లర్ ఆన్ చేసి వేరే పనిలో పడిపోతుంటాం. అలాంటి సందర్భంలో పెంపుడు జంతువులు ఆ స్ర్పింక్లర్ వైపు వెళ్తే చాలా ప్రమాదం. అందుకే ఇంటి గార్డెన్‌లో వాడేందుకు ప్రత్యేకంగా తయారుచేసిందే ‘పెట్ రిపెల్లెంట్ స్ర్పింక్లర్’. ఉడుతలు, పిల్లులు, కుక్కలు ఇలా అన్నింటినీ ఇది గుర్తిస్తుంది. పైగా శబ్దం చేస్తూ.. నీటిని షూట్ చేస్తుంది. కాబట్టి జంతువులు అటువైపు వెళ్లవు. ఇందులో 30 అడుగుల దూరం వరకు పనిచేసే మోషన్ డిటెక్షన్ సెన్సర్ ఉంది.
రక్షణ కాలర్
పెంపుడు జంతువు ఆరోగ్యం గురించి, అది ఉన్న లొకేషన్ గురించి తెలుసుకోవడానికి ‘స్మార్ట్ కాలర్’ ఉంది. దీని సాయంతో దాని గుండెలయను గమనిస్తూ ఉండొచ్చు. వాటి హృదయ స్పందనలో ఏ చిన్న మార్పు వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా ‘స్మార్ట్ కాలర్’ తక్షణమే యజమానికి సమాచారం అందిస్తుంది. వాటి నిద్ర వేళల్నీ రికార్డు చేస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పెట్స్ ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది.
బటన్ చెబుతుంది
కుక్కపిల్లకు ఆకలేసినా, సరదాగా బయట తిరగాలనిపించినా ‘డాగ్ కమ్యూనికేషన్ బటన్స్’ సాయంతో తెలుసుకోవచ్చు. నీలం, ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ ఇలా ఒక్కో రంగును... నీరు, ఆహారం, ఔటింగ్, ఆటలు, అవును, కాదు మొదలైన ఆదేశాలకు గుర్తుగా ఉపయోగించొచ్చు. అందుకు తగినట్లు పెట్స్‌కి శిక్షణ ఇవ్వాలి. ఆయా బటన్స్‌లో ముందుగా విషయాన్ని రికార్డు చేసుకోవడం ద్వారా డాగీ బటన్ నొక్కగానే రికార్డు చేసిన వాయిస్ బిగ్గరగా వినిపిస్తుంది. దీంతో పెట్ అవసరాలను సులువుగా తెలుసుకునే వీలుంటుంది.
Updated Date - Nov 17 , 2024 | 10:50 AM