ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చీరల డిజైన్‌లో ఊహించని విప్లవం! మహిళలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:44 PM

ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక వెల్లివిరుస్తున్న కాలం ఇది. అనేక రంగాల్లో యువత తమ కొత్త ఆలోచనలకు ప్రత్యేక్ష రూపం ఇస్తూ వృత్తివ్యాపారాల్లో దూసుకుపోతున్నారు. ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు తమదైన పరిష్కారాలు చూపిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకత వెల్లివిరుస్తున్న కాలం ఇది. అనేక రంగాల్లో యువత తమ కొత్త ఆలోచనలకు ప్రత్యక్ష రూపం ఇస్తూ వృత్తివ్యాపారాల్లో దూసుకుపోతున్నారు. ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు తమదైన పరిష్కారాలు చూపిస్తున్నారు. తాజాగా చీరల డిజైన్‌లోనూ ఈ ఒరవడి సుస్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా (Viral) మారిన ఈ చీరకు డిజైనర్లు ఏకంగా ఓ జేబు అమర్చడం విశేషం.

Viral: భార్యలో తీవ్ర అసహనం.. సీసీటీవీ ఫుటేజీలో ఆమె చేస్తున్న పని భర్త చూసి..


మహిళలకు ఈ చీర ఎంత అనువో చెబుతూ రూపొందించిన వీడియో కూడా జనాలను యమాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలోని మోడల్ కట్టుకున్న చీరకు ఓవైపున చక్కగా ఇమిడిపోయేలా జేబు అమర్చారు. ఈ చీర ఎంత ఉపయోగమో మోడల్ కళ్లకు కట్టినట్టు చూపించింది. టేబుల్ పక్చన కూర్చున్న ఆమె చేతిలోని ఫోనును సులువుగా తన చీర జేబులో పెట్టుకుంది. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే వాళ్లకు ఇది ఎంత ఉపయోగమో చక్కగా చూపించింది (Woman designs innovative saree with built-in pockets for carrying items).

ఇదంతా చూసిన జనాలు మహిళలు ఇది అద్భుతమైన డిజైన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో ఇప్పటివరకూ 87 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మహిళ జీన్స్‌కే జేబులు తీసేస్తున్న తరుణంలో చీరకు పాకెట్ పెట్టడం నిజంగా సృజనాత్మకతే అని కొందరు అన్నారు. ఇకపై స్త్రీల వస్తువులను చేతపట్టుకోవాల్సిన బాధ్యత పురుషులకు తప్పిపోయిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 09:55 PM

Advertising
Advertising