Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
ABN, Publish Date - Nov 09 , 2024 | 03:28 PM
తనకు జాబ్ పోయాక విడాకులిచ్చిన భార్య నాలుగేళ్ల తరువాత మళ్లీ తన కొత్తకారు చూసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందని ఓ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టాడు. ఈ ఉదంతంపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అన్ని బాంధవ్యాలు ఆర్థిక బంధాలేనని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే, నేటి ఆధునిక జమానాలో మాత్రం అనేక మంది డబ్బే పరమావధిగా బతికేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఫలితంగా జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. మనసులో మాట చెప్పుకునే వారే కరువైన పరిస్థితుల్లో అనేక మంది కూరుకుపోతున్నారు. ఇటీవల అనేక మంది దంపతులు ఆర్థికాంశాల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన మాజీ భార్య పంపిన నోటీసుల గురించి ప్రస్తావిస్తూ నెట్టింట పెట్టి పోస్టు తెగ వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న 4 ఏళ్లకు మాజీ భార్య రూ.4 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపిందని అతడు ఆరోపించాడు. ఒక వీడియో కూడా షేర్ చేశాడు. ఇది ప్రస్తుతం జనాలు నోరెళ్ల బెట్టేలా చేస్తోంది (Viral).
Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తన మాజీ భార్య ఎర్నెస్ట్ యంగ్ అనే సంస్థలో పనిచేసేదని అతడు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనకు జాబ్ పోవడంతో ఆమె తనకు విడాకులు ఇచ్చేసిందని అన్నాడు. అప్పట్లో తమకు నానో కారు మాత్రమే ఉండేదని కూడా చెప్పాడు. ఆ తరువాత నాలుగేళ్లకు తాను మెర్సిడీజ్ బెంజ్ కారు కొన్నట్టు చెప్పాడు. ఆయా కార్లకు సంబంధించిన ఫుటేజీ కూడా షేర్ చేశాడు. అయితే, తన కొత్త మెర్సిడీజ్ కారు ఫొటోలు ఫేస్బుక్లో చూసిన తన మాజీ భార్య నాలుగేళ్ల తరువాత మళ్లీ లీగల్ నోటీసులు పంపిందని చెప్పాడు. ఇప్పుడు రూ.2 కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తోందని అన్నాడు.
Viral: దేవుడా! పంది మేతను తింటున్న యువతి! ఎందుకని అడిగితే..
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. జీవితం చాలా సంక్లిష్టమైనదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. జీవితంలోని బంధాలన్నీ గత జన్మ కర్మలను అనుసరించి ఏర్పడినవేనని చెప్పుకొచ్చారు. కొందరు డబ్బుకు ఇచ్చిన విలువ జీవిత భాగస్వాములకు ఇవ్వరని, డబ్బు లేకపోతే చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరి దృష్టి వీడియోలోని మెర్సిడీజ్ కారుపై పడింది. నాలుగేళ్లల్లో ఈ ఖరీదైన కారు కొనేంతటి డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అయితే, ఈ వీడియోపై వ్యక్తి మాజీ భార్య కామెంట్స్ మాత్రం అతడి టైం లైన్లో కనిపించలేదు. ఇక జనాలు ఈ ఉదంతంపై తెగ కామెంట్స్ చేస్తుండటంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Updated Date - Nov 09 , 2024 | 03:39 PM