ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: అప్పులోళ్లకు రైతు బిడ్డ షాక్! లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళుతుంటే..

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:57 PM

అప్పు తీసుకున్నాక తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారి ఉదంతాలు నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే, తాజా ఉదంతంలో ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్లను బురిడీ కొట్టించేందుకు పెద్ద ప్లాన్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అప్పు తీసుకున్నాక తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారి ఉదంతాలు నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే, తాజా ఉదంతంలో ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్లను బురిడీ కొట్టించేందుకు పెద్ద ప్లాన్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా..మహిళ అతి తెలివి చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు (Viral). రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: రోజూ స్నానం చేయని భర్త! విసుగెత్తిపోయిన భార్య ఏం చేసిందంటే..


బాన్స్‌వారా జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోను @ashokdamodar864 పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్థానికంగా ఉంటున్న ఓ కుటుంబం లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుక్కుంది. అయితే, అప్పు సకాలంలో చెలించలేకపోవడంతో రికవరీ ఏజెంట్లు వారి ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు ఇంటికొచ్చారు. అప్పుడు ఇంట్లోని ఓ యువతి తనకు అమ్మవారు పూనినట్టు నాటకమాడుతూ రికవరీ ఏజెంట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారిని భయపెట్టి వెళ్లగొట్టేందుకు ఊగిపోతూ నానా దుర్భాషలాడింది. మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది (Woman Fakes Goddess Possession To Save Tractor From Loan Agents).

Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..


ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లేమో ట్రాక్టర్‌ను తీసుకెళ్లకపోతే తమ ఉద్యోగాలు పోతాయంటూ విజ్ఙప్తి చేయడం కూడా వీడియోలో రికార్డైంది. ఇక వీడియో వెనక నిజానిజాలపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ జనాలను మాత్రం ఈ ఉదంతం బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. నెట్టింట ఇది తెగ వైరల్ అవుతుండటంతో జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. వేల కొద్దీ కామెంట్స్ చేశారు.

ఇక గతంలోనూ లోన్ తీసుకున్న వారు అప్పులు తిరిగి చెల్లించకపోగా ఫైనాన్షియర్లను బెదిరించిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే, ఈ ఉదంతంలో సినిమా ట్విస్ట్‌లను మించి మహిళ బెదిరింపులకు దిగడం జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 16 , 2024 | 04:12 PM

Advertising
Advertising