Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..
ABN, Publish Date - Apr 02 , 2024 | 04:03 PM
బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి తన ఇంటికి క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.2 వేలు చెల్లించాల్సి రావడంతో ఓ మహిళ దిమ్మెరపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పేరు చెబితే..ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీనే. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి నానా అవస్థలు పడే వారి ఉదంతాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇది చాలదన్నట్టు..ఆకాశాన్నంటే క్యాబ్‌ల ధరలు ఉన్నతవర్గాలకూ చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. తన పరిస్థితిని వివరిస్తూ ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!
మనశ్వీ శర్మ అనే మహిళ ఇటీవల పూణె నుంచి బెంగళూరుకు (Bengaluru) విమానంలో వచ్చింది. టిక్కెట్టు ధర రూ.3500 (woman flies to bengaluru for 3500). అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె ఆ తరువాత క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఉబర్ గో క్యాబ్‌కు ఏకంగా రూ.2 వేలు చెల్లించాల్సి రావడంతో ఆమె దిమ్మెరపోయింది. ‘‘పూణె నుంచి బెంగళూరుకు విమానం టిక్కెట్టు రూ.3.5 వేలు అయితే బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి మా ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌కు ఏకంగా రూ.2 వేలు చెల్లించాల్సి వచ్చిందంటూ ఆమె వాపోయింది (uber ride to home for Rs 2k). ఇది చాలదన్నట్టు.. ‘కార్లన్నీ అందుబాటు ధరల్లోనే..’ అని కంపెనీ ప్రకటించడం చూసి నోటమాట రాలేదని కామెంట్ చేసింది. కొన్ని క్యాబ్‌ల ధరలూ రూ.2700 వరకూ ఉన్నాయని చెప్పుకొచ్చింది.
Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..
మహిళ ఉదంతంపై స్పందించిన అనేక మంది బెంగళూరులో ప్రైవేటు రవాణా సర్వీసులు చుక్కలు చూపిస్తుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కార్లలో కనీసం ఏసీ కూడా వేయరని, ప్రీమియర్ కార్లకే ఏసీ అని నిక్కచ్చిగా చెప్పేస్తుంటారని వాపోయారు. బెంగళూరులో ఇలా ఉందని కానీ మిగతా నగరాల్లో పరిస్థితి అనుకూలంగానే ఉందని ఒకరు చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తన ఇంటికి వెళ్లేందుకు కేవలం రూ.192లే ఖర్చైందని అన్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వెళ్లాలంటే చాలా టైం పడుతుందని అన్నారు. ఇక కార్లకు బదులు గుర్రాలు వాడటం మంచిదని కొందరు సెటైర్లు పేల్చారు.
Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 02 , 2024 | 04:08 PM