ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య వింత రివెంజ్.. షాకింగ్ వీడియో!

ABN, Publish Date - Nov 23 , 2024 | 08:11 PM

ఆధునిక జమానాలో వివాహ వ్యవస్థ బీటలు వారుతోంది. కారణాలు ఏమైనప్పటికీ పెడపోకడలు ఎక్కువవుతున్నాయి. ఈ తీరుతో స్త్రీపురుషులిద్దరికీ మనశ్శాంతి కరువవుతోంది. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనను మోసం చేసిన భర్తను ఓ మహిళ శిక్షించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల బంధం.. జీవితాంతం నిలిచుండాల్సిన అనుబంధం. కానీ ఆధునిక జమానాలో వివాహ వ్యవస్థ బీటలు వారుతోంది. కారణాలు ఏమైనప్పటికీ పెడపోకడలు ఎక్కువవుతున్నాయి. ఈ తీరుతో స్త్రీపురుషులిద్దరికీ మనశ్శాంతి కరువవుతోంది. ప్రశాంతంగా సాగాల్సిన జీవితాలు ఒడిదుడుకుల పాలవుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు బట్టబయలు చేసుకుంటున్న జంటలు నలుగురిలో నవ్వుల పాలవుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనను మోసం చేసిన భర్తను ఓ మహిళ శిక్షించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి (viral).

Viral: బాస్ రియాక్షన్‌కు కన్నీటిపర్యంతమైన యువతి! రాజీనామా చేస్తున్నానని చెబితే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని అతడి భార్య నలుగురిలో నిలబెట్టి పరువు తీసే ప్రయత్నం చేసింది. ‘‘నేను రెండేళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగించా’’ అని రాసున్న బోర్డును అతడి మెడలో వేలాడదీసి వీధిలో అతడిని నడిపించింది. చప్పట్లు చరుస్తూ నలుగురి దృష్టి తన భర్తపై పడేలా చేస్తూ అతడిని ఎండగట్టే ప్రయత్నం చేసింది.

‘‘నా భర్త ఓ మోసగాడు. తన బిడ్డను నేను కడుపున మోస్తుంటే అతడేమో మరో మహిళకు దగ్గరయ్యాడు. మేం కావాలనే రెండో బిడ్డను కనాలనుకున్నాం. అన్నీ తెలిసీ అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు’’ అని గట్టిగా అరిచి మరీ చెప్పింది. భార్య ఇంతలా రచ్చ చేస్తున్నా భర్త మాత్రం తనకేమీ పట్టనట్టు నిలబడ్డాడు. ఆమె చేయమన్నదల్లా చేశాడు. తనకేం సంబంధం లేనట్టు ప్రవర్తించాడు.

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..


కాగా, ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు వివిధ రకాలుగా స్పందించారు. భార్య అలా నలుగురిలో పరువు తీస్తుంటే మనౌంగా భరించడం సబబు కాదని ఆ వ్యక్తి కొందరు తప్పుపట్టారు. మోసం చేసిన భర్తను వదిలిపెట్టాలని కానీ ఇంకా అతడితో ఉండటం ఏం పద్ధతని మహిళను కూడా తప్పుపట్టారు. ‘‘ఇలాంటి ఘటనలు చూస్తే వివాహ వ్యవస్థ చివరి దశకు చేరుకుందన్న భావన కలుగుతుంది. ఇలా మీ వ్యక్తిగత విషయాలను నలుగురిలో బహిరంగ పరచడం నామోషీగా అనిపించట్లేదా’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

Viral: బ్రిటన్‌లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరైన భారతీయ యువతికి షాకింగ్ అనుభవం!

Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు

Read Latest and Viral News

Updated Date - Nov 23 , 2024 | 08:14 PM