ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కారు డ్రైవర్‌ను ఆసక్తిగా గమనించిన మహిళ.. దిగివెళ్తూ అతన్ని కౌగిలించుకుని మరీ.. ఆమె చెప్పిన విషయం తెలిస్తే..

ABN, Publish Date - Jan 26 , 2024 | 04:52 PM

అద్దె వాహనాల్లో ప్రయాణించే సమయంలో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ప్రధానంగా మహిళలకు ఇలాంటి సమయాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. కారు డ్రైవర్లు..

అద్దె వాహనాల్లో ప్రయాణించే సమయంలో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ప్రధానంగా మహిళలకు ఇలాంటి సమయాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. కారు డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలూ చూశాం. అయితే తాజాగా, ఆస్ట్రేలియాలో ఓ కారు డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. అతడి కారు ఎక్కిన ఓ మహిళ మొదటి నుంచీ ఆసక్తిగా గమనిస్తోంది. చివరకు దిగి వెళ్తూ అతన్ని కౌగిలించుకుని మరీ ఆమె చెప్పిన విషయం ఏంటంటే..

ఆస్ట్రేలియాలో (Australia) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఉబెర్ కారు డ్రైవర్ (Uber car driver) జేమ్స్‌కు ఇటీవల ఓ రోజు ఊహించని అనుభవం ఎదురైంది. రోజూ మాదిరే విధులకు వెళ్లిన అతను.. ఓ వృద్ధ జంటను తన కారులో ఎక్కించుకున్నాడు. మెల్‌బోర్న్‌లో వారిని డ్రాప్ చేయాల్సి ఉంది. అయితే కారు ఎక్కిన వృద్ధులు మొదటి నుంచి డ్రైవర్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో దిగే సమయంలో వారిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కారు దిగిన మహిళ అటువైపు తిరిగి డ్రైవర్ వద్దకు వచ్చింది. డోర్ తట్టగానే అతను అద్దం కిందకు దించాడు. అప్పుడు ఆమె అసలు విషయాన్ని తెలియజేసింది.

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

రెండేళ్ల క్రితం తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పింది. ‘‘నా కొడుకు అచ్చం నీలాగే ఉండేవాడు’’.. అని కారు డ్రైవర్‌తో చెప్పి.. అతన్ని ప్రేమతో కౌగిలించుకుని (woman hugging car driver) కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సదరు డ్రైవర్ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమెను తాను కూడా తల్లిలాగే భావిస్తూ వారికి ఎంతో ప్రేమతో వీడ్కోలు పలికాడు. ఈ ఘటన మొత్తం కారులో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మనసును కదిలించే ఘటన’’.. అంటూ కొందరు, ‘‘ఆమెను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదేందయ్యా.. రైల్వే ట్రాకుపై ఈ అమ్మాయిలు చేస్తున్న పనులు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Jan 26 , 2024 | 06:06 PM

Advertising
Advertising