ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఎడారిలో చిక్కుకుపోయిన యువతులకు వింత అనుభవం! ఉబెర్ యాప్‌లో ఒంటెల సవారీ!

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:04 PM

ఎడారిలో ఉన్న ఇద్దరు యువతులు ఉబెర్ యాప్‌ ద్వారా ఒంటె సవారీ బుక్ చేసిన ఉదంతం సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఎడారిలో ఉన్న ఇద్దరు యువతులు ఉబెర్ యాప్‌ ద్వారా ఒంటె సవారీ బుక్ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (viral) అవుతోంది. దుబాయ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Viral: షాకింగ్! కోడి గుడ్డు కనబడగానే ఈ పాము ఎలా రెచ్చిపోయిందో చూడండి.


పూర్తి వివరాల్లోకి వెళితే, తాము దుబాయ్‌లోని ఓ ఎడారి ప్రాంతంలో తప్పిపోవడంతో ఉబెర్ యాప్‌‌లో ఏదైనా రైడ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించామని ఆ యువతులు చెప్పుకొచ్చారు. కానీ యాప్ తెరిచేసరికి అందులో కార్లతో పాటు ఒంటె సవారీ ఆప్షన్ కూడా కనిపించిందని అన్నారు. దాన్ని ఎంచుకున్న కొంత సేపటికి ఓ వ్యక్తి ఒంటెతో సహా తమ ముందుకు వచ్చాడని చెప్పారు. దుబాయ్ హట్టా రోడ్డుకు సమీపంలోని అల్ బదాయర్ ప్రాంతంలో ఈ వీడియో షూట్ చేసినట్టు చెప్పారు.

Viral: పైల్స్‌తో నరకం! లీవ్ కోసం ప్రూఫ్ కావాలని మేనేజర్ ఉద్యోగిని అడగడంతో..

ఈ మేరకు వారు నెట్టింట పంచుకున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఉబెర్‌లో ఇలాంటి సౌకర్యం కూడా ఉంటుందా అని అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. తాము తప్పిపోయామని ఆ యువతులు చెబుతున్నా వారి వెనక ఉన్న రోడ్డు తమకు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్ చేశారు.


మొబైల్ సిగ్నల్స్, స్మార్ట్‌ఫోన్, జీపీఎస్ అందుబాటులో ఉండగా వారు ఎలా తప్పిపోతారని కొందరు ప్రశ్నించారు. వారు చూపించిన లొకేషన్‌ను తమ యాప్‌లో సెట్ చేసి కొందరు పరీక్షించారు. ఈ క్రమంలో తమకు యాప్‌లో ఒంటెలా సవారీ ఏదీ తమకు కనిపించలేదని కుండబద్దలు కొట్టారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్‌గా మారిన ఈ వీడియోకు 83 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ జనాలను మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. మరీ మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Viral News: పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. కారణం ఏంటో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Oct 21 , 2024 | 09:06 PM